Balakrishna : బాక్సాఫీస్ షేకయ్యే న్యూస్.. రీరిలీజ్ కాబోతున్న బాలయ్య బ్లాక్​బస్టర్ మూవీ

- Advertisement -

Balakrishna : ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు, ఏయ్!! నువ్వు బయపడితే బయపడటానికి ఓటరు నీ అనుకున్నవా బే … షూటర్ నీ… కాల్చి పారేస్తా నా కొడకా, ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే ప్రమాదం.. నేను ఒకడికి ఎదురైన వాడికి రిస్క్.. తొక్కి పడేస్తా.. ఈ డైలాగ్స్ వింటుంటే ఓ రూపం మీ మెదడులో మెదులుతోంది కదూ. అది నటసింహం నందమూరి బాలకృష్ణే కదూ. ఆయన కాక ఇంకెవ్వరు ఇలాంటి పవర్ ఫుల్ డైలాగ్స్​తో ఎంటర్​టైన్ చేయగలరు చెప్పండి. ఇంతకీ ఈ సినిమా గుర్తుందా.. అదేనండి బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో బాలయ్య చేసిన లెజెండ్ సినిమాలోని ఈ డైలాగ్స్​ను మరిచిపోవడం అంత ఈజీ కాదులెండి. ఈ సినిమా రిలీజ్ అయి ఈ ఏడాదికి సరిగ్గా పదేళ్లు పూర్తయింది.

Legend @ 8 Years | 'లెజెండ్' @ 8 ఇయర్స్..బాల‌కృష్ణ కెరీర్‌లో ఓ  అద్భుతం-Namasthe Telangana

2014లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఫ్యాన్స్​కు పూనకాలు తెప్పించింది. ఈ మూవీలో ఒక్కో డైలాగ్ ఒక్కో డైమండ్. ప్రతి డైలాగ్​కు ప్రేక్షకులు సీటు మీద నుంచి లేవాల్సిందే. విజిల్ వేయాల్సిందే. గూస్​బంప్స్ తెప్పించిన ఈ సినిమాలో బాలయ్య బాబు డ్యూయెల్ రోల్ చేశారు. ఇక ఇందులో రాధికా ఆప్టే, సోనాల్ చౌహాన్ నటించారు. జగపతిబాబు ఈ చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేశాడు. రిలీజ్ అయి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా లెజెండ్ సినిమా మళ్లీ థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధంగా ఉంది. మేకర్స్ ఈ చిత్రాన్ని థియేటర్లలో రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మార్చి 30న గ్రాండ్​గా రిలీజ్ కానుంది.

- Advertisement -

First Look: Telugu actor Nandamuri Balakrishna's Legend - Rediff.com

బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్​లో విడుదలైన రెండో సినిమా ఇది. అంతకుముందు ఈ ఇద్దరూ కలిసి పని చేసిన ‘సింహా’ కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్​ సాధించింది. ఇందులో బాలయ్య డ్యూయెల్​ రోల్​లో నటించారు. అందులో ఒకటి జయ్​దేవ్ అలియాస్ లెజెండ్ ఇంకా కృష్ణ. ‘లెజెండ్’ మూవీ దాదాపు 31 సెంటర్లలో వంద రోజులు ఆడింది. మరో రెండు సెంటర్లలో 175 రోజులు రన్ అయింది. బాలయ్య సినిమాల్లో డబుల్​ సెంచరీ దాటిన సినిమాల్లో ‘లెజెండ్’​ కూడా ఒకటి. ‘ముద్దుల మావయ్య’, ‘సమరసింహా రెడ్డి’, ‘నరసింహ నాయుడు’, ‘సింహా’ తర్వాత ఆ లిస్ట్​లో లెజెండ్ ఐదవ స్థానాన్ని దక్కించుకుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here