Meena : రెండవ పెళ్లి పై క్లారిటీ ఇచ్చేసిన మీనా..!

- Advertisement -

Meena : చాలామంది హీరోయిన్లు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ లోకి వచ్చి మంచి పేరు తెచ్చుకుని తర్వాత హీరోయిన్ గా మారి పాపులర్ అయిపోయారు. అలా ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళలో మీనా కూడా ఒకరు. మీనా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. స్టార్ హీరోయిన్ గా సక్సెస్ ని అందుకున్నారు. సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. చాలామంది టాప్ హీరోల సరసన నటించారు మీనా. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసి వరస సినిమాలు మీనా ప్రస్తుతం ఒంటరిగా జీవితాన్ని గడుపుతోంది. గత ఏడాది తన భర్త విద్యాసాగర్ అనారోగ్య సమస్యల బారిన పడి చనిపోయారు. తన కూతురితో కలిసి ఆమె ఉంటోంది. పెళ్లి చేసుకోబోతుంది అని వార్తలు సోషల్ మీడియాలో తరచూ వస్తూనే ఉన్నాయి.

రెండో పెళ్లి గురించి వస్తున్నటువంటి వార్తలపై స్పందించి ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మీనా పాల్గొన్నారు. కొన్ని ఆసక్తికరమైన విషయాలని పంచుకున్నారు. రెండవ పెళ్లి గురించి సంచలన కామెంట్స్ చేశారు. మీనా ఇటీవల కాలంలో తన రెండవ పెళ్లి గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఇది వరకే నేను నా రెండో పెళ్లి గురించి చాలా సార్లు చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను. నాకు ప్రస్తుతానికి రెండో పెళ్లి చేసుకోవాలని ఆలోచన ఏమీ లేదు.

ఒకవేళ అలాంటి ఆలోచన వస్తే ముందుగా మీకు అన్ని విషయాలను చెప్తానని మీనా అన్నారు. అప్పటివరకు ఎవరు నా గురించి ఎలాంటి రూమర్స్ ని స్ప్రెడ్ చేయకండి నా గురించి ఎవరు కూడా ఆలోచించొద్దు అని మీనా చెప్పారు. ప్రస్తుతం మీనా పంచుకునే విషయాలు వైరల్ అవుతున్నాయి. నెట్టింట మీనా షేర్ చేసుకున్న వాటిని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ రూమర్లకి అడ్డుకట్ట వేశారు. పెళ్లి గురించి క్లారిటీ ని ఇచ్చేసారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here