Keerthy Suresh పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. వరుస బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ అయ్యింది. మహానటి సినిమాతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.. ఆ సినిమా తర్వాత ఆమె లెవల్ మారింది.. ఆ సినిమా తర్వాత నటించిన సినిమాలు కొన్ని నిరాశ పరిచిన ఒకటి రెండు మంచి హిట్ ను అందుకున్నాయి.. సోషల్ మీడియాలో మాత్రం అమ్మడు ఈ మధ్య యాక్టివ్ గా ఉంటుంది.
లేటెస్ట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కామెంట్లను అందుకుంటుంది.. ఇప్పుడు ఆమె పెళ్లిపై వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఆమె పెళ్లి చేసుకోబోయేది ఇతన్నే అంటూ ఓ వార్త షిఖారు చేస్తుంది.. అతని గురించి కీర్తి సురేష్ తల్లి ఏమందో ఇప్పుడు చూద్దాం..
మేనక కుమార్తె ఆయన కీర్తి సురేష్ బాలనటిగానే మలయాళ సినిమాల్లో కనిపించింది. తర్వాత గీతాంజలి అనే మలయాళ సినిమాతో హీరోయిన్గా మారింది.అయినా సరే మలయాళ సినీ పరిశ్రమలో ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. కానీ తెలుగులో ఆమెకు అవకాశాలు లభించాయి, ముందుగా చేసిన సినిమా రిలీజ్ అవ్వకపోయినా తర్వాత చేసిన సినిమా నేను శైలజతోనే ఆమె సూపర్ హిట్ అందుకుంది.
అయితే మహానటి సినిమా తర్వాత ఆమె పాత్రల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఆమె చేసిన దాదాపు అన్ని లేడీ సినిమాలు బాక్స్ ఆఫీస్ బోల్తా కొట్టాయి.మళ్లీ గ్లామర్ పాత్రల వైపు చూస్తూ గ్లామర్ విషయంలో కూడా ఏ మాత్రం వెనకడుగు వేసేది లేదంటూ దూసుకుపోతోంది. అయితే తాజాగా ఆమె పెళ్లి గురించి కీర్తి సురేష్ సోషల్ మీడియాలో అనేక చర్చలు జరుగుతున్నాయి. ఆమె తన చిన్ననాటి క్లాస్మేట్ తో రిలేషన్ లో ఉన్నట్టుగా ఒక ప్రచారం అయితే జరుగుతోంది.
వీరిద్దరి వివాహానికి సైతం తల్లిదండ్రులు ఒకే చెప్పారని వార్తలు వినిపిస్తున్నాయి.. కేరళలోని ఒక రిసార్ట్ యజమాని అని త్వరలోనే వీరు పెళ్లి గురించి అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉందని కూడా ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఈ విషయాలను కీర్తి సురేష్ తల్లి మేనక సురేష్ ఖండించారు. అసలు కీర్తి సురేష్ పెళ్లి గురించి జరుగుతున్న ప్రచారం అంతా నిజం కాదని తన కూతురు తరపున తాను వాటిని ఖండిస్తున్నానని ఆమె చెప్పుకొచ్చారు.. ప్రస్తుతం పెళ్లి చేసుకొనే ఆలోచన లేదని చెప్పుకొచ్చింది..ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంది..