Deepthi Sunaina : సీక్రెట్ టాటూను బయటపెట్టిన దీప్తి సునైన.. పిక్స్ వైరల్..

- Advertisement -

Deepthi Sunaina .. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. వెబ్ సీరీస్ చేస్తూ ఫెమస్ అయిన అమ్మడు బిగ్ బాస్ లోకి వెళ్లి ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.. ఆ తర్వాత సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ ఫోటో షూట్ లు చేస్తూ యువతకు నిద్రలేకుండా చేస్తుంది.. ఇక దీప్తి తన లేటెస్ట్ ఫోటో షూట్ లో భుజం ఉన్న టాటూ రివీల్ చేసింది. హగ్ సింబల్ కూడిన సదరు టాటూ చాలా సెక్సీగా ఉంది. దీంతో కుర్రాళ్ళు వెర్రెత్తి పోతున్నారు. దీప్తి లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.. సీక్రెట్ టాటూను బయటపెట్టిందంటూ కామెంట్లను అందుకుంటుంది..

Deepthi Sunaina
Deepthi Sunaina

షణ్ముఖ్ తో దీప్తి సునైన విడిపోయిన సంగతి తెలిసిందే. అయితే వీరు మళ్ళీ కలిసిపోయారనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఇటీవల కలిసి ఈవెంట్స్ చేస్తున్న ఈ జంట ఒకరిపై మరొకరు పొగడ్తలు కురిపించుకుంటున్నారు. దీప్తికి షణ్ముఖ్ బర్త్ డే విషెస్ కూడా చెప్పడంతో ఇద్దరికీ అవగాహన కుదిరిందని గట్టిగా వినిపిస్తోంది.బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొన్న షణ్ముఖ్ కంటెస్టెంట్ సిరితో చాలా సన్నిహితంగా మెలిగారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గా ఫైనల్ కి చేరిన ఈ జంట హౌస్ లో రొమాన్స్ కురిపించారు. స్నేహితులమని చెబుతూనే హగ్గులు, ముద్దులతో రెచ్చి పోయారు.

Deepthi Sunaina Photos

షణ్ముఖ్ ప్రవర్తన నచ్చని కారణంగానే దీప్తి సునైన షణ్ముఖ్ తో విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారని ప్రచారమైంది. ఇక బ్రేకప్ తర్వాత కెరీర్ పై ఫోకస్ పెట్టనున్నట్లు దీప్తి చెప్పుకొచ్చింది. షణ్ముఖ్ తో బ్రేకప్ బాధ నుండి బయటపడటం కోసం ఎన్నో ప్రయత్నాలు కూడా చేసింది.. ప్రస్తుతం దీప్తి షణ్ముఖ్ లేకుండా స్పెషల్ సాంగ్స్, సిరీస్లు చేస్తున్నారు. త్వరలో వీరి కాంబోలో ఓ ప్రాజెక్ట్ రానుందట.. మరి వీరిద్దరూ కలుస్తారో లేదో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here