Bigg Boss తెలుగు రియాలిటీ షో ప్రారంభమయ్యి మూడు రోజులు అవుతుంది. 14 మంది కంటెస్టెంట్స్ ను హౌస్ లో వదిలేసి.. ఈ ఇంటిపై ఓ కన్నేసి ఉంచమని నాగ్ వెళ్ళిపోయాడు. ఇక ముందు నుంచి చెప్పినట్టుగానే ఈసారి బిగ్ బాస్ అంత ఈజీగా ఉండబోయేది లేదని.. ఎప్పటికప్పుడు బిగ్ బాస్ నిరూపిస్తూనే ఉన్నాడు. ఇక వచ్చిన రోజు నుంచి ప్రతిదానికి టాస్కులు ఇచ్చిగెలుచుకోవాలి అని చెప్పుకొస్తూనే ఉన్నాడు. మొదటి రోజు సోఫాల కోసం.. ఆ తరువాత బెడ్స్ కోసం బిగ్ బాస్ ఏదో ఒక టాస్క్ ఇస్తూనే ఉన్నాడు.
అయితే అవన్నీ టాస్క్ లా కాదు టార్చర్ లా ఉంది అని అంటున్నారు ప్రేక్షకులు. ఇక సోఫాల టాస్క్ పక్కన పెడితే.. కంటెస్టెంట్స్ వచ్చిన దగ్గరనుంచి కాఫీ ఇవ్వకుండా బిగ్ బాస్ టార్చర్ పెడుతున్నాడు. సాధారణంగా .. చాలామందికి కాఫీ తాగితేనే కానీ, పనిచేయలేరు. అది వారి బలహీనత. హౌస్ లో వయస్సు అయ్యినవారు కూడా ఉన్నారు.వారికి కాఫీ తాగకపోతే తలనొప్పివస్తుంది. అవన్నీ తెలిసి కూడా బిగ్ బాస్ కాఫీ పౌడర్ ను ఇవ్వకుండా ఆడుకుంటున్నాడు అని నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా శివాజీ అంతలా ఫైర్ అవ్వడానికి కారణం కూడా అదే.
నలుగురు కంటిన్యూస్ గా కాఫీ కావాలని అడుగుతున్నా.. పట్టించుకోకుండా తమ సహనాన్ని పరీక్షిస్తున్నాడు అని కంటెస్టెంట్స్ ఫీల్ అవుతున్నారు. శివాజీ, షకీలా.. శోభా ఇలా అందరు కాఫీ కోసం కాచుకు కూర్చున్నవారే. ఇక కాఫీ పౌడర్ దక్కించుకొనే టాస్క్ కూడా పెట్టకుండా..వారిని రెచ్చగొట్టే విధంగామాట్లాడడం అస్సలు బాగోలేదని అంటున్నారు. బిగ్ బాస్ పై శివాజీ ఫైర్ అవ్వడం.. దానివలన ఇంట్లో గొడవలు.. శివాజీ బయటకు వెళ్ళిపోతాను అనడం.. ఇదంతా కంటెంట్ కోసం చేయడం బాగానే ఉంది కానీ, ఎదుటివారి బలహీనతలను అడ్డుపెట్టుకొని వారితో గేమ్ ఆడించాలని అనుకోవడం దిగజారిపోవడమని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు.