Jabardasth Varsha : అక్కడేం లేదు అంతా డొల్ల.. నీ కన్నా ఇమ్మాన్యుయలే నయమంటూ జబర్దస్త్ వర్షపై నెటిజన్ల కామెంట్స్

- Advertisement -

Jabardasth Varsha : జబర్దస్త్ ప్రోగ్రామ్ గురించి తెలియని వారుండరు. ప్రతి గురు, శుక్రవారాల్లో జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ అంటూ ప్రతి ఇంటా నవ్వులు పూయించేందుకు వచ్చే ఈ కార్యక్రమం అంటే తెలుగు ప్రేక్షకులకు భలే ఇష్టం. ఇక ఈ ప్రోగ్రామ్ లో సుధీర్-రష్మి జంట ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ జంట తర్వాత అంతకాకపోయినా బాగా పాపులారిటీ సంపాదించుకున్న మరో జంట వర్ష-ఇమ్మాన్యుయెల్. చూడటానికి ఇద్దరూ మంచి మ్యాచ్ అనిపించకపోయినా తెరపై వీళ్లు పంచే కామెడీకి మాత్రం ఫ్యాన్స్ ఫిదా.

మోడలింగ్ రంగంలో అరంగేట్రం చేసిన వర్ష ఆ తర్వాత సీరియళ్లలో నటించి ఇప్పుడు జబర్దస్త్ ప్రోగ్రామ్ లో బిజీ అయింది. అందులో కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీలోనూ వర్ష సందడి చేస్తుంది. జబర్దస్త్ లో ఇమ్మాన్యుయెల్ తో వర్ష లవ్ ట్రాక్ చాలా ఫేమస్. ఈ జంటపై ఇప్పటికే చాలా స్కిట్లు కూడా చేశారు. అంతే కాకుండా వీళ్లిద్దరికి పెళ్లి చేస్తూ ఓ స్పెషల్ ఈవెంట్ కూడా ప్లాన్ చేశారు.

- Advertisement -

ఇక వర్ష బుల్లితెరపైనే కాదు సోషల్ మీడియాలో కూడా యమా యాక్టివ్. తరచూ తన ఫొటోషూట్స్ పోస్టు చేస్తు ఉంటుంది. అంతేగాక ట్రెండింగ్ రీల్స్ చేస్తూ ప్రేక్షకులకు ఫన్ పంచుతుంది. ఈ బ్యూటీ షేర్ చేసే గ్లామరస్ ఫొటోలకు కుర్రాళ్లు ఫిదా. ఈ భామ అందాన్ని హీరోయిన్లతో కూడా పోల్చుతుంటారు. ఇక తాజాగా వర్ష కింగ్ నాగార్జున నటించిన రగడ మూవీలోని అయ్య బాబోయ్ బుల్లెట్ బేబీ సెగ అనే పాటకు స్టెప్పులేసింది. లియోపార్డ్ ప్రింట్ ఉన్న పొట్టి గౌనులో తన అందాలు చూపించీ చూపించనట్టుగా డ్యాన్స్ చేస్తూ.. ర్యాంప్ వాక్ చేస్తూ అదరగొట్టింది. ఈ రీల్ పోస్టు చేసిన కొద్దిసేపట్లోనే 1.7 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

అయితే వర్ష చేసిన ఈ రీల్ కింద మాత్రం కామెంట్స్ మామూలుగా లేవు. ఈ భామ ఫ్యాన్స్ పొగుడుతూ కామెంట్స్ చేస్తే మరికొందరు మాత్రం నెగిటివ్ కామెంట్స్ తో ఇన్ బాక్స్ నింపేశారు. కొందరేమో వర్షను జూనియర్ సమంత అని పొగుడుతుంటే ఇంకొందరు వర్ష అసలు అమ్మాయిలాగే లేదంటూ డర్టీ కామెంట్స్ చేశారు. ఇక కొందరైతే నీకంటే ఆ ఇమ్మాన్యుయెల్ నయం కదమ్మా అంటూ కామెంట్ చేశారు. ఓ నెటిజన్ అయితే లోపల ఏం లేదు.. అంతా డొల్ల అంటూ డర్టీ కామెంట్స్ చేయగా.. వర్ష సపోర్టర్స్ మాత్రం సముద్రంలో దొరుకుతుంది ఉప్పు మా అక్క నిప్పు అని సపోర్టు ఇస్తూ రెచ్చిపోయారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here