karan johar దేవర మాస్ ప్లానింగ్.. కరణ్ జోహర్ చేతికి హిందీ థియేట్రికల్ రైట్స్

- Advertisement -

karan johar ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఆ చిత్రంలో నటించిన మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ల నెక్స్ట్ సినిమాలపైనే అందరి దృష్టి పడింది. రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్ లో గేమ్ ఛేంజర్ చేస్తుండగా.. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో దేవర చేస్తున్నాడు. రెండు పార్టులుగా వచ్చే ఈ సినిమా తొలి విభాగం షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ నెగిటివ్ రోల్ లో కనిపించనున్నారు.

తాజాగా ఈ మోస్ట్ అవైటెడ్​ మూవీ నార్త్ థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్​ రైట్స్ గురించి అఫీషియల్ అనౌన్స్​మెంట్ వచ్చింది. ప్ర‌ముఖ బాలీవుడ్ నిర్మాత క‌ర‌ణ్ జోహార్ ద‌క్కించుకున్నారు. 2015లో బాహుబలి హిందీ వెర్షన్ కూడా కరణ్ జోహర్ తన సంస్థ ధర్మ ప్రొడక్షన్ ద్వారా విడుదల చేసిన విషయం తెలిసిందే. బాహుబలిలో భళ్లాలదేవగా నటించిన రానాకు హిందీ సినిమాలో ప్రముఖులతో మంచి స్నేహం ఉన్న విషయం తెలిసిందే. కరణ్ జోహర్ కు కూడా రానాతో మంచి బాండ్ ఉంది. ఇక రాజమౌళిపై చాలా నమ్మకం ఉంది. అందుకే బాహుబలి సినిమాను హిందీలో రిలీజ్ చేశారు. అది అక్కడ కూడా కలెక్షన్ల వర్షం కురిపించింది.

- Advertisement -

ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆర్​ఆర్​ఆర్​ సినిమాతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఆ సినిమా రిజల్ట్ చూసి అదే నమ్మకంతో ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా నార్త్ ఇండియా డిస్ట్రిబ్యూషన్ రైట్స్​ను కూడా కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ సొంతం చేసుకుంది. దీంతో పాటు AA ఫిల్మ్స్ కూడా దక్కించుకుంది. ఈ సినిమా నార్త్ ఇండియా థియేటర్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ పార్టనర్ షిప్ అనౌన్స్ చేస్తున్నందుకు, ఒక మంచి సినిమా అనుభవాన్ని అందరికి ఇవ్వగలుగుతున్నందుకు చాలా గర్వంగా, థ్రిల్​గా ఉంది అంటూ కరణ్ జోహార్ తమ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.

సీ కాన్సెప్ట్​ బ్యాక్​డ్రాప్​తో తెరకెక్కుతున్న దేవర రెండు భాగాలుగా వస్తుందని ఇప్పటికే మూవీ మేకర్స్ ప్రకటించారు. మొదటి భాగం అక్టోబర్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్‌లపై మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రూ.120 కోట్లకుపైగా భారీ బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మాణం జరుగుతుంది. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here