సమంత కోసం ఆమె వీరాభిమాని, గుంటూరులోని బాపట్లలో ఆలపాడు గ్రామానికి చెందిన సందీప్ గుడి కట్టారు. ఈ సంగతి తెలిసిందే. సమంత పుట్టిన రోజు (Samantha Birthday) సందర్భంగా నిన్న (ఏప్రిల్ 28, శుక్రవారం) గుడి ఓపెన్ చేశారు. కేక్ కట్ చేయడంతో పాటు గ్రామస్థులు, అభిమానులను పిలిచి గ్రాండ్ ఈవెంట్ చేశారు. అక్కడి వరకు బావుంది. ఆ తర్వాతే అసలు కథ మొదలు అయ్యింది. అయితే, గుడిలో సమంత రూపమే ఒక రేంజ్ ట్రోలింగ్ మెటీరియల్ అయ్యింది. సందీప్ కట్టించిన గుడిలో బొమ్మ సమంతలా లేదనేది నెటిజనులు చెప్పే మాట.
ఆ మాట చెప్పడమే కాదు, ట్రోల్స్ చేస్తున్నారు. ‘బావుందన్నా… నిజంగా బావుంది అన్నా’ అని ఒకరు కామెంట్ చేస్తే, ‘అక్కడ సమంత లేదు కదా సార్! మరి, టెంపుల్ ఏంటి?’ అని ఇంకొకరు మీమ్ క్రియేట్ చేశారు. అసలు ఆమె సమంతలా లేదని.. నందమూరి లక్ష్మి పార్వతిలా ఉందని అంటున్నారు. మరికొంత మంది నెటిజన్స్ మాత్రం సమంత ఆ విగ్రహంలో షర్మిలా కనిపిస్తున్నారని అంటున్నారు. సమంతలా లేదు ఉప్పల్ బాలు పేస్ కనబడుతుందని మరికొంత మంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం సమంత విగ్రహం.. దీనికి సంబంధించిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇక సమంత సినిమాల విషయానికి వస్తే.. ఆమె ఇటీవల శాకుంతలం (Shaakuntalam) అనే పౌరాణిక చిత్రంతో పలకరించింది. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈచిత్రంలో సమంత టైటిల్ రోల్ ను పోషించింది. ఈ సినిమా మంచి అంచనాల నడుమ ఏప్రిల్ 14 న వరల్డ్ వైడ్ గా గ్రాండ్’గా రిలీజ్ అయ్యి ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ సినిమా తర్వాత సమంత ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తోన్న సంగతి తెలిసిందే.
ఈ వెబ్ సిరీస్‌కు తెలుగు దర్శకులు రాజ్ అండ్ డికే (Raj and DK) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌తో పాటు సమంత తెలుగులో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) సరసన ఖుషి (Kushi) అనే రొమాంటిక్ ఎంటర్టైనర్లో నటిస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై సమంత ఫ్యాన్స్ బోలెడన్ని అంచనాలు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకుంటోంది.