Neha Shetty : నేహా శెట్టి ఈ పేరు తెలియని వారుండరూ. ఢీజే టిల్లు సినిమాలో రాధిక క్యారెక్టర్ తో బాగా పాపులర్ అయిపోయింది ఈ అమ్మడు. ‘మెహబూబా’ చిత్రంతో ఈ ముద్దుగుమ్మ తెలుగు ఆడియెన్స్ కు పరిచయం అయ్యింది. అప్పటి నుంచి ఇక్కడే వరుసగా చిత్రాలు చేస్తోంది. కానీ ఈ బ్యూటీకి గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా మాత్రం అదే. సిద్ధూ జొన్నలడ్డ సరసన నటించి మెప్పించింది. రాధిక పాత్రలో డీజే టిల్లు లవర్ గా యూత్ కు ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. తన నటన, అందంతో ఆడియెన్స్ ను కట్టిపడేసింది. ఈ చిత్రం తర్వాత నేహాకు టాలీవుడ్ లో వరుస ఆఫర్లు అందుతూ వచ్చాయి. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తోంది. ఓవైపు సినిమాలతో అలరిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తోంది. తన బ్యూటీఫుల్ ఫొటోషూట్లతో ఆకట్టుకుంటోంది.

లేటెస్ట్ ఫ్యాషన్ ను పరిచయం చేస్తూనే మరోవైపు గ్లామర్ విందు చేస్తోంది. మరిన్ని ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్న ఈ ముద్దుగుమ్మ దర్శకనిర్మాతల కంట్లో పడేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా అమ్మడు సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయింది. పట్టు చీరలో తన అందంతో ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోలో నేహా శెట్టి వారణాశిలో ఉన్నట్లు తెలుస్తోంది. బోట్‌లో చీరలో చాలా అందంగా కనిపిస్తోంది. నేహా శెట్టి తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
నేహా శెట్టి ప్రస్తుతం హీరో విశ్వక్ సేన్ తో కలిసి ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా 2024 వేసవిలో విడుదల కానుందని తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని సార్లు ఈ సినిమా వాయిదా పడింది. 2016లో వచ్చిన కన్నడ సినిమా ‘ముంగారు ములే 2’తో నేహా శెట్టి సినిమాల్లో అడుగు పెట్టింది. 2023లో ‘బెదురులంక 2012’, ‘రూల్స్ రంజన్’ సినిమాల్లో నటించింది. కానీ ఆ రెండు సినిమాలు ఆశించిన రేంజ్ సక్సెస్ అందుకోలేక బాక్సాఫీసు వద్ద చతికిల పడ్డాయి.