NBK – PSPK మల్టీ స్టారర్ సినిమా.. డైరెక్టర్?

- Advertisement -

NBK – PSPK : మల్టీ స్టారర్ సినిమా.. డైరెక్టర్? బాలయ్య అన్ స్టాపబుల్ పవన్ కళ్యాణ్ సెకండ్ ఎపిసోడ్ కోసం జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే..తాజాగా అన్‌స్టాపబుల్ గ్రాండ్ పవర్ ఫినాలే సెకండ్ ఎపిసోడ్‌లో అభిమానులకు బాలయ్య, పవన్ కళ్యాణ్ ఇద్దరు కిక్ ఎక్కించారు. అంతకు మించి కిక్కించే అప్‌డేట్ ఇచ్చారు.. బాలయ్య, పవన్ కళ్యాణ్ ఓ షో కోసం కలిస్తేనే ఇరు హీరోల అభిమానులతో పాటు ఇండస్ట్రీలో ప్రకంపనలు మొదలయ్యాయి. అలాంటి ఈ ఇద్దరు హీరోలు ఒక టాక్ షో కోసం కాకుండా ఒక సినిమాలో నటిస్తే ఆ కిక్కే వేరప్ప అంటున్నారు అభిమానులు..ఈ షోలో తాజాగా వీరిద్దరూ కలిసి సినిమా చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

NBK - PSPK
NBK – PSPK

అన్‌స్టాపబుల్ టాక్ షోలో బాలయ్య, పవన్ కళ్యాణ్ మల్టీస్టారర్ పై బాలయ్య ప్రేక్షకులను ప్రశ్న అడగగా అందరు బాలకృష్ణ, పవన్ మల్టీస్టారర్ మూవీ చేస్తే బాగుంటుందని చెప్పారు. బాలయ్య ముందుగా పవన్ తో మల్టీస్టారర్‌కు ఒప్పుకోగా, ఆ తర్వాత పవన్ కూడా బాలయ్య తో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి అభ్యంతరం లేదని చెప్పారు.. ఈ మాట విన్న ఇద్దరి ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేవనే చెప్పాలి.. ఇక వెంటనే బాలయ్య మల్టీ స్టారర్ కోసం నా దగ్గర ఒక కథ ఉంది అని సూటిగా ప్రశ్నలు వేశారు.. తర్వాత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ. .తనకు బాలయ్యతోని ముక్కుసూటి తనం, మనసులో ఏదుంటే అది మాట్లాడం కల్మషం లేని వ్యక్తిత్వం తనకు ఇష్టమని చెప్పారు..

Pawan kalyan - balakrishna

రాజకీయాల గురించి ఎన్నో రహస్యాలను పవన్ కళ్యాణ్ పంచుకున్నారు.. బాలయ్య అనుభవాలను అడిగి తెలుసుకున్నారు పవన్.. మొత్తానికి పవన్కళ్యాణ్ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది.. మొత్తంగా అల్లు అరవింద్‌తో ఎపిసోడ్‌లో చిరంజీవితో మల్టీస్టారర్‌కు సై అన్న బాలయ్య.. తాజాగా పవన్‌తో గ్రాండ్ ఫినాలేలో పవన్ కళ్యాణ్‌తో మల్టీస్టారర్ చేస్తానని చెప్పడం ఇటు నందమూరి అభిమానులతో పాటు అటు మెగా అభిమానుల్లో జోష్ నింపిందనే చెప్పాలి.. త్రివిక్రమ్ డైరెక్షన్ లో వీరిద్దరూ కలిసి సినిమా చెయ్యాలనే అనుకుంటున్నారని సమాచారం.. మరి వీరి ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here