సౌత్ ఇండియా లో సూపర్ స్టార్ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని దక్కించుకున్న హీరోయిన్స్ లో ఒకరు నయనతార. మలయాళం సినిమాల ద్వారా వెండితెర అరంగేట్రం చేసిన నయనతార, ఆ తర్వాత తమిళంలో ‘చంద్రముఖి’ సినిమా ద్వారా మంచి గుర్తింపు ని దక్కించుకుంది. ఈ సినిమా తమిళం తో పాటుగా తెలుగు లో కూడా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే.
ఈ చిత్రం తర్వాత నయన్ మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అటు తమిళం లో వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూనే, మరోపక్క తెలుగు లో కూడా సూపర్ హిట్స్ ని అందుకొని సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ గా ఎదిగింది. అంతే కాదు, లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కూడా ఈమె కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ఇక రీసెంట్ గా షారుఖ్ ఖాన్ తో ‘జవాన్’ చిత్రం లో నటించి మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది.
ఇది ఇలా ఉండగా నయనతార కి స్టార్ స్టేటస్ వచ్చిన తర్వాత కూడా కాస్టింగ్ కౌచ్ సమస్యలు తలెత్తాయి అట. ఆరోజుల్లో ఈమె ప్రభాస్ తో కలిసి ‘యోగి’ అనే చిత్రం లో నటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా అప్పట్లో కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈ చిత్రం ప్రొమోషన్స్ కి వచ్చినప్పుడు ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు నయనతార ని లైంగిక వేధింపులకు గురి చేసాడట. నయనతార అవి తట్టుకోలేక ఏడ్చేసింది అట.
అప్పటి నుండి ఆమె ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి, ప్రొమోషన్స్ కి పాల్గొనట్లేదని ఇండస్ట్రీ వర్గాల్లో ఎప్పటి నుండో టాక్ ఉంది. యోగి సినిమా సమయానికి ఆమె సౌత్ లో పెద్ద స్టార్, అంత పెద్ద స్టార్ కి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది అంటే ఎంత దురదృష్టకరమో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటివి చూసిన తర్వాత అమ్మాయిలు ఇండస్ట్రీ కి ఎలా రాగలరు ధైర్యం గా అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.