Nayanthara : ఏడేళ్ల నుంచి ప్రేమలో ఉన్న నయన్- విఘ్నేశ్ గతేడాది జూన్‌లో వివాహంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. వృత్తిపరంగా ఇద్దరూ బిజీగా ఉంటున్నా అప్పుడప్పుడు విహార యాత్రలు చేస్తున్నారు. చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘గాడ్ ఫాదర్’లో నయనతార కీలక పాత్ర పోషించారు. షారుఖ్‌ఖాన్ సరసన ‘జవాన్’, పలు తమిళ చిత్రాల్లో ఆమె నటిస్తున్నారు. ఈ ఏడాది ‘కాతువాకుల రెండు కాదల్’ చిత్రంతో దర్శకుడిగా మెప్పించిన విఘ్నేశ్.. అజిత్‌తో ఓ సినిమా తెరకెక్కించనున్నారు.

విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan)తో తన ప్రేమకథ ఎలా మొదలైందో నయనతార (Nayanthara) తెలిపింది. ‘నేనూ రౌడీనే’ (Naanum Rowdy Dhaan) సినిమా మొదలు కావడానికి కంటే ముందే తాను ఆమెతో ప్రేమలో పడినట్లు చెప్పారు. కెరీర్‌లో సవాళ్లు ఎదుర్కొంటోన్న రోజుల్లోనే తన ప్రేమకథ మొదలైందని పేర్కొన్నారు. పోడాపోడి సినిమా కథ చెప్పడానికి వచ్చినప్పుడే విఘ్నేశ్ తనతో ప్రేమలో పడ్డాడని నయనతార చెప్పారు. ఆ సినిమా రెండో షెడ్యూల్ షూట్ నుంచే మేమిద్దరం డేటింగ్ మొదలుపెట్టాం. మేమిద్దరం ప్రేమించుకుంటున్నామనే విషయం మేము చెప్పేవరకూ ఎవరికీ తెలియలేదు. సెట్ లో కూడా నన్ను మేడం అని పిలిచేవాడు. చివరికి నా కారవ్యాన్ లో కూడా వచ్చేవాడు కాదు అని చెప్పింది.

ఇక విఘ్నేశ్ మాట్లాడుతూ..‘‘మా ఇద్దరికీ సింపుల్‌గా జీవించడమే ఇష్టం. ఇటీవల మేమిద్దరం ట్రైన్‌లోనూ జర్నీ చేశాం. అందరూ దాన్ని పెద్ద విషయంగా చూశారు. మా కులదైవాన్ని సందర్శించుకుందామని నేనూ, నయనతార తిరుచ్చి వెళ్లాం. అక్కడి నుంచి ఫ్లైట్‌లో రిటర్న్ అయితే ఇంటికి చేరే సరికి అర్ధరాత్రి అయ్యే ఛాన్స్ ఉంది. పిల్లలను ఇంట్లోనే ఉంచి వచ్చాం. ఫ్లైట్ కోసం వేచి ఉండే బదులు రైలు ప్రయాణం ఉత్తమం అనిపించి… ఎక్కేశాం. మమ్మల్ని చూసి ప్రయాణీకులు ఆనందంతో కేకలు వేశారు. ఫొటోలు తీసుకోవడానికి ఎగబడ్డారు. అది వాళ్ల ప్రేమాభిమానం. నేను అర్థం చేసుకోగలను. కానీ, కొన్ని పరిస్థితుల్లో వాళ్లను ఎలా అదుపు చేయాలో అర్థం కాదు’’ అని విఘ్నేశ్ శివన్ వివరించారు.