లేడి బాస్ Nayanthara పెళ్లి తర్వాత సినిమాలను తగ్గించినట్లు కనిపిస్తుంది.. ఈ మధ్య ఈమె సైన్ చేసిన సినిమాలు లేవనే చెప్పాలి.. ఇక బాలివుడ్ లో తన మార్క్ ను చూపించబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే, బాలివుడ్ నటుడు షారూక్ ఖాన్ కు నయన్ ముద్దు పెట్టిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.. పబ్లిక్ ఉన్నారన్న సంగతి కూడా మర్చిపోయి ఇలా చేసిందేంటి? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో నెట్టింట చక్కర్లు.. అసలు విషయానికొస్తే…

హీరోయిన్ నయనతార నటిస్తున్న బాలీవుడ్ చిత్రం జవాన్. కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ జవాన్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ లో భాగంగా షారుక్ చెన్నై వచ్చినట్లు సమాచారం..ఈ క్రమంలో మర్యాదపూర్వకంగా షారుక్ నయనతార ఇంటికి వెళ్ళాడు. అనంతరం తిరిగి వెళుతుండగా నయనతార కారులో కూర్చున్న షారుక్ ఖాన్ బుగ్గపై ముద్దు పెట్టింది. పబ్లిక్ లో నయనతార ఓ హీరోని కిస్ చేయడం హాట్ టాపిక్ అయ్యింది. ఆన్ స్క్రీన్ పై ఇవ్వన్నీ ఓకె. ఆఫ్ స్క్రీన్ లో జరగడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

అందులోనూ నయనతారకు పెళ్లయింది. దీంతో షారుక్ ఖాన్ కి మర్యాదపూర్వకంగా పెట్టిన ముద్దు కూడా వార్తలకు ఎక్కింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. జవాన్ మూవీలో విజయ్ సేతుపతి, ప్రియమణి కీలక రోల్స్ చేస్తున్నారు. దీపికా పదుకొనె క్యామియో రోల్ లో మెరవనున్నారు. జవాన్ మూవీ జూన్ 6న విడుదల కానుంది.. అలాగే షారుక్ ఖాన్ షారుక్ పఠాన్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు.
ఏళ్ల తరబడి పరాజయాలతో షారుక్ సతమతమయ్యారు. దీంతో ఆయన పనైపోయిందని విమర్శలు వెల్లువెత్తాయి. దాదాపు నాలుగేళ్లు గ్యాప్ తీసుకుని పఠాన్ మూవీతో ప్రేక్షకులను పలకరించారు. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన పఠాన్ వెయ్యి కోట్ల వసూళ్ల దిశగా దూసుకుపోతుంది. దీపికా పదుకొనె హీరోయిన్ గా నటించారు. జాన్ అబ్రహం విలన్ రోల్ చేశారు.. బాలివుడ్ చరిత్రను తిరగరాసింది ఈ సినిమా.. ఇకపోతే నయనతర కూడా ఒకటో రెండో సినిమాలు చేస్తుంది..