Nayanathara : కోలీవుడ్ స్టార్ కపుల్ నయనతార – విగ్నేష్ శివన్ ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటారు. కొన్నేళ్లు ప్రేమించుకొని పెళ్లి చేసుకొని సరోగసి పద్దతిలో కవల పిల్లలని కూడా కన్నారు ఈ జంట. అసలు క్యూట్ కపుల్ అంటే ఇలా ఉండాలి అని అందరూ అనుకునేలా ఫోటోలు, వీడియోలు షేర్ చేసేవారు. ఏ సెలబ్రేషన్ వచ్చినా నయన్ విగ్నేష్ కలిసి దిగిన ఫోటోలని షేర్ చేస్తూ సందడి చేసేవారు.

ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమని సోషల్ మీడియాలో పోస్టులతో చూపించారు. తాజాగా నయన్ – విగ్నేష్ విడిపోతారా అంటూ వార్తలు వస్తున్నాయి. నయనతార తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో.. ఆమె కన్నీళ్లతో కూడా ఇది నాకు లభించిందని ఎప్పటికీ చెబుతుంది అనే అర్ధం వచ్చేలా ఇంగ్లీష్ లో ఓ కొటేషన్ పెట్టింది. అంతే కాకుండా తన భర్త విగ్నేష్ ని ఇన్‌స్టాగ్రామ్ లో అన్ ఫాలో చేసింది. దీంతో ఈ వార్త వైరల్ గా మారింది. ఇటీవల సెలబ్రిటీలు విడిపోయేముందు ఒకర్నొకరు సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ నయన్ అన్ ఫాలో చేసినా, విగ్నేష్ ఇంకా ఫాలో చేస్తున్నాడు. సోషల్ మీడియాలో వీరిద్దరి ఫోటోలు మాత్రం అలాగే ఉన్నాయి.

దీంతో వీరిద్దరూ విడిపోతున్నారా? లేకా అనుకోకుండా అన్ ఫాలో చేసిందా? లేదా ఏదైనా టెక్నికల్ సమస్యా? అని ఫ్యాన్స్, నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అస్సలు వీరిద్దరూ విడిపోయే ఛాన్స్ లేదు అని కూడా కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవలే వాలెంటైన్స్ డేకి ఇద్దరూ స్పెషల్ పోస్టులు కూడా షేర్ చేసి తమ ప్రేమని తెలియచేసారు. అయితే కొన్ని రోజుల క్రితం విగ్నేష్ డైరెక్షన్ చేస్తున్న ఓ సినిమాలో నయనతారని ఒక పాత్ర చేయమని అడిగితే నో చెప్పిందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఇలా భర్తని అన్ ఫాలో చేయడంతో నయన్ వైరల్ గా మారింది. దీంతో ఈ ముద్దుగుమ్మ ఏమనుకుందో ఏమో తిరిగి మళ్లీ భర్తను ఫాలో అవుతోంది.