Naveen Polishetty : గడిచిన 5 ఏళ్లలో కొంతమంది చిన్న హీరోలు బాగా షైన్ అయ్యారు. స్టార్ హీరోల సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడం తో ప్రేక్షకులు వీళ్ళ చిత్రాలకు బ్రహ్మరథం పెట్టేస్తున్నారు. కెరీర్ ప్రారంభం లో చిన్న చిన్న పాత్రల ద్వారా ఇండస్ట్రీ లో నెట్టుకొచ్చిన నటులలో ఒకరు నవీన్ పోలిశెట్టి. సపోర్టింగ్ రోల్స్ తో అలరించిన నవీన్ పోలిశెట్టి ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ తో మొట్టమొదటిసారిగా హీరోగా మారాడు. ఈ చిత్రం ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి నవీన్ ని హీరో గా నిలబెట్టింది.
ఈ చిత్రం తర్వాత ఆయన చేసిన ‘జాతి రత్నాలు‘ చిత్రం టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. నవీన్ పోలిశెట్టి కామెడీ టైమింగ్ ని చూసి ప్రతీ ఒక్కరు ఫిదా అయిపోయారు. టాలీవుడ్ భవిష్యత్తు లో పెద్ద స్టార్ హీరో అవ్వబోతున్నాడని, ఈ కుర్రాడిలో మామూలు టాలెంట్ లేదు, విషయం లేని సన్నివేశాలను కూడా తన యాక్టింగ్ తో వేరే లెవెల్ కి తీసుకెళ్తున్నాడు అని విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు.
ఇక రీసెంట్ గా విడుదలైన ‘మిస్ శెట్టి..మిస్టర్ పోలిశెట్టి’ సినిమాకి మొదటి ఆట నుండే డివైడ్ టాక్ వచ్చింది. కానీ నవీన్ పోలిశెట్టి కామెడీ టైమింగ్ జనాలకు మెల్లగా ఎక్కడం వల్ల ఈ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది. ఇకపోతే ఈ సినిమా ప్రొమోషన్స్ అప్పుడు ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూస్ లో తన జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. తనకి చిన్నప్పటి నుండి సినిమాలు అంటే పిచ్చి అని, ఎలా అయిన హీరో అవ్వాలనే కసి ఉండేదని చెప్పుకొచ్చాడు.
ఇంట్లో కూడా నేను మొదటి నుండి ఇదే చెప్తూ వచ్చాను, పెద్దయ్యాక కూడా మా నాన్న కి ఇదే చెప్తే, ఆయన ముందు నువ్వు బీటెక్ పూర్తి చెయ్యి, ఆ తర్వాతనే సినిమాల్లోకి నీకు ఎంట్రీ అని కండిషన్ పెట్టాడట. దీంతో ఎలా అయిన బీటెక్ పాస్ అవ్వాలనే కసితో రోజుకి 17 గంటలు చదివి మంచి మార్కులతో పాస్ అయ్యాడట. కొన్ని రోజులు జాబ్ కూడా చేసాడట, కానీ తన మెయిన్ ఫోకస్ సినిమాలు కాబట్టి, కొన్ని రోజుల తర్వాత జాబ్ రిజైన్ చేసి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినట్టు చెప్పుకొచ్చాడు నవీన్ పోలిశెట్టి.