Naatu Naatu : దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు సినిమాకి అంతర్జాతీయ గౌరవం, గుర్తింపు లభించాయి. అన్నిటికంటే ఎక్కువ గౌరవం ఆస్కార్ తో లభించింది.. మనదేశం ఇన్నేళ్లుగా ఎదురుచూసిన కల ఇప్పుడు నెరవేరింది.. తెలుగు సినిమాకు ఆస్కార్ వచ్చింది..ఆస్కార్ కోసం ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం పట్టువదలని విక్రమార్కుల్లా పని చేశారు. ముఖ్యంగా రాజమౌళి ఖచ్చితంగా ఆస్కార్ కొట్టాల్సిందే అని భీష్మించుకు కూర్చున్నారు. మరి రాజమౌళి అంత పట్టుదలతో ఉంటే ఆస్కార్ రాకుండా ఉంటుందా? 95వ అకాడమీ అవార్డు వేడుకల్లో ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాట ఆస్కార్ గెలుచుకుంది. ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు గెలుచుకున్న తొలి భారతీయ చిత్రంగా నిలిచింది.అందుకే ఈ సినిమాకు ఒకప్పుడు కన్నా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ అవుతుంది..

మన ఇండియా నుంచి ఆస్కార్స్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో పోటీపడి అవార్డ్ సొంతం చేసుకున్న నాటు నాటు పాటనే ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని ఊపేస్తోంది.. ఉర్రూతలూగిస్తోంది. సినీ ప్రముఖుల నుంచి మొదలుకుని బిజినెస్ మేన్ల వరకు.. క్రీడా ప్రముఖుల నుంచి మొదలుకుని రాజకీయ ప్రముఖుల వరకు.. అందరి హృదయాలను గెల్చుకున్న ఈ నాటు నాటు పాటపై సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతుండటం మనం చూస్తూనే ఉన్నాం..ఈ పాట గురించి ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తున్నారు..
ఈ పాటకు అందరూ ఎలా చేశారో చూసాము.. ఇక తాజాగా నాటు నాటు సాంగ్‌పై టెస్లా కార్లను ఉపయోగించి చేసిన లైట్ షో వీడియో కూడా అలాంటిదే. నాటు నాటు సాంగ్ బీట్స్‌కి, మ్యూజిక్‌కి అనుగుణంగా కార్ల లైట్స్, ఇండికేటర్స్ ఆన్ ఆఫ్ చేస్తూ చేసిన టెస్లా కార్ల లైట్ షో వీడియో చూస్తే.. షాక్ అవుతారు.. ఒక తెలుగు పాటకు ఇంత క్రేజ్ రావడం గ్రేట్ అనే చెప్పాలి.. ఈ లైటింగ్ షో కోసం కొన్ని వందల సంఖ్యలో టెస్లా కార్లను ఉపయోగించినట్టు వీడియో చూస్తే అర్ణమవుతోంది. న్యూ జెర్సీ లాంటి గ్లోబల్ సిటీలో ఈ వీడియోను షూట్ చేశారు. ఆ వీడియో చూస్తే అమేజింగ్ అని అనిపించకమానదు.. వీడియో పోస్ట్ చేసిన ఏడెనిమిది గంటల్లోనే 22.5 లక్షలకుపైగా లైక్స్ సొంతం చేసుకుంది. ట్విటర్ యూజర్స్ ఈ వీడియోకు సాహో అంటున్నారు. అమెరికా లాంటి అగ్రరాజ్యం ఒక తెలుగు పాటకు లభించిన ఈ ఆధరణ, క్రేజ్ అద్భుతం.. అత్యద్భుతం అని కామెంట్స్ చేస్తున్నారు.. ఇక చెప్పడం ఎందుకు చూడండి మీరే..