Jr. NTR: పాన్ ఇండియా యాడ్ లో.. 5 భాషల్లో అదరగొట్టిన తారక్..

- Advertisement -

JR NTR : రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ ను అందుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్.. ఇటీవల ఈ చిత్రంలోని నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు కూడా లభించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నటనకు యావత్ ప్రపంచం ఫిదా అయింది. ఇక ఆల్ ఇండియా సినిమాలతో పాటు పాన్ ఇండియా యాడ్స్ కూడా సిగ్నల్ ఇచ్చారు . తాజాగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన అప్పీ ఫీజ్ యాడ్ ను చేశారు. ఈ యాడ్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది..

JR NTR
JR NTR

ఈ యాడ్ లో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ కూడా నటించారు. చూడు ఇంకొక కొత్త రోజు.. ఈ రోజు నువ్వు కూడా కొత్తగా చేసేయ్.. అందరిలాగా మారమంటుంది ఈ లోకం. ఏది వినధ్దు.. ఏది అనొద్దు.. నువ్వు అందరిలాగా కాదు.. నీలా ఎవ్వరూ లేరు.. నువ్వు నువ్వేంటి అనేది అందరికీ చూపించు.. ఉత్సాహం కొత్తది.. రంగు రూపులు కొత్తవి.. మీ హుషారైన రంగులు ఏమంటున్నాయో విను.. ఇవాళ కొత్తది ఏమైనా చేసి చూపించు.. వి ఆల్ న్యూ అప్పీ ఫీజ్.. ఈ యాడ్ ముగిస్తుంది..

ntr

కృతి సనన్, జూనియర్ ఎన్టీఆర్ వన్ బై వన్ గా నటిస్తూ.. ఈ యాడ్ పూర్తి చేశారు. వాస్తవానికి వాళ్లు మాట్లాడే మాటలు హుషారెత్తించాయి.. ఈ యాడ్ ను ఐదు భాషల్లో చేయటం విశేషం. జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ట్ అయ్యాక చేసిన మొదటి పాన్ ఇండియా యాడ్ ఇది కావటం మరో ప్రత్యేకత.

- Advertisement -

గతంలో అప్పి ఫీజ్ యాడ్ చాలామంది స్టార్స్ చేశారు. ఈసారి కృతి సనన్, తారక్ చేయడంతో ఈ యాడ్ కి సరికొత్త అందం క్రియేట్ అయింది అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విడుదలైన కొన్ని క్షణాల్లోనే అత్యధిక సంపాదించుకోవడంతో పాటు ఈ వీడియోకి లైక్స్ తో పాటు కామెంట్స్ కూడా వెల్లువెత్తుతున్నాయి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here