విజయ్ నిర్మలకు ఓ బాబు జన్మించిన తర్వాత సూపర్ స్టార్ కృష్ణని రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈమె మరణించిన మూడు సంవత్సరాలకు కృష్ణ కూడా ఆమె దిగులతోనే చనిపోయారు. ఇక వీరు సంపాదించిన ఆస్తులకు వారసులు ఎవరు అన్న సందేహం అందరిలోనూ కలిగింది. అయితే తాజాగా నరేష్ మొదటి భార్య కుమారుడు నవీన్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని విజయనిర్మల ఆస్తులకు వారసులు ఎవరు అనే విషయం గురించి వెల్లడించారు. ఆ ఇంటర్వూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చెప్పుకొచ్చారు.

కేవలం పవిత్రా లోకేష్.. నరేష్ ఆస్తుల కోసమే పెళ్లి చేసుకున్నారని, ప్రేమ ఉండి కాదని కొంత మంది స్టేట్ మెంట్స్ ఇచ్చారు.. దీనిపై మీ సమాధానం ఏంటి అని ఇంటర్వ్యూలో యాంకర్ నవీన్ ను అడిగారు. దీనికి నవీన్ మాట్లాడుతూ… ‘నాకు తెలిసి ఆమె జన్యూన్ పర్సన్. నాతో మాత్రం బాగుంటారు. ఫుడ్ కూడా పంపిస్తారు. వాళ్లిద్దరూ హ్యాపీగా ఉన్నారు. అది చాలు.. మహేశ్ గారు మాట్లాడాల్సిన అవసరం లేదు.. డాడీ ఏం చిన్నపిల్లాడు కాదు.

అడ్వైస్ లు ఇవ్వడానికి. మిస్టేక్స్ అందరి జీవితాల్లో జరుగుతాయని’ తెలిపారు. కొన్ని వేల కోట్లు సంపాదించారు విజయ్ నిర్మల గారు… నవీన్ గారికే 50 శాతం రాశారు… మిగతా 50 శాతం నరేష్ గారికి రాశారు అనే దాంట్లో నిజమెంత అని యాంకర్ ప్రశ్న అడగ్గా… దీనిపై నవీన్ తనదైన శైలీలో సమాధానం తెలిపారు. నవీన్ మాట్లాడుతూ… ‘అది రాస్తామని అనుకున్నారు. ప్రస్తుతానికి నరేష్ గారి పేరు మీద మొత్తం ఆస్తి ఉంది. ఆయనే ఆస్తికి వారసుడు. నేను రిటైర్డ్ అయ్యాక నువ్వే కదా చూసుకునేది.. అని నరేష్ అన్నారు’ ఏదో ఒక ఐడియా పెట్టుకోమని చెప్పారు.