Naresh Pavitra గత ఏడాది నుండి ఎలక్ట్రానిక్ మీడియా మరియు సోషల్ మీడియా లో వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన జంట నరేష్ – ప్రవిత్ర లోకేష్.ఇద్దరూ కూడా టాలీవుడ్ లో క్యారక్టర్ ఆర్టిస్టులుగా మంచి డిమాండ్ ఉన్నవాళ్లే.కానీ ఇప్పుడు ఈ వివాదాల కారణం గా ఆ డిమాండ్ మొత్తం పడిపోయినట్టు విశ్లేషకులు చెప్తున్నారు.నరేష్ కి అడపాదడపా పలు సినిమాల్లో ఆఫర్స్ వస్తున్నప్పటికీ, పవిత్ర లోకేష్ కి మాత్రం అసలు అవకాశాలు రావడమే ఆగిపోయాయి.

అయితే ప్రపంచం ఏమి అనుకున్నా , ఎన్ని ట్రోల్ల్స్ ఎదురైనా , దాని ప్రభావం ఎలా ఉన్నా కూడా లెక్క చెయ్యకుండా నేడు ఈ జంట పెళ్లి చేసుకుంది.ఈ పెళ్ళికి సంబంధించిన వీడియో ని నరేష్ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అప్లోడ్ చేసాడు.వీటికి నెటిజెన్స్ నుండి తీవ్రమైన వ్యతిరేకత ఎదురైంది.ఇదంతా పక్కన పెడితే నరేష్ మూడవ భార్య రమ్య ఇప్పటికీ విడాకులు ఇవ్వని సంగతి తెలిసిందే.

గత కొంత కాలం గా దీనిపై రమ్య న్యాయపోరాటం చేస్తూనే ఉంది.వాళ్లిద్దరూ నేను బ్రతికి ఉండగా ఎలా పెళ్లి చేసుకుంటారో నేను కూడా చూస్తా అంటూ అప్పట్లో సవాలు చేసిన రమ్య, తాను అన్నట్టుగానే నేడు నరేష్ – పవిత్ర లోకేష్ పెళ్ళికి వచ్చింది.ఈ పెళ్లిని ఆపేందుకు ఆమె పెద్ద రగడ చెయ్యడానికి ప్రయత్నం చేసింది కానీ, అక్కడ ఉన్న లేడీ పోలీసులు ఆమెని ఈడ్చుకొని వెళ్లిపోయారు.

గతం లో కూడా బెంగళూరు లో ఒక హోటల్ లో నివసిస్తున్న నరేష్ – పవిత్ర ని చెప్పుతో కొట్టడానికి రమ్య వస్తుంది.అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో ఇప్పటికీ వైరల్ గా ట్రెండ్ అవుతూనే ఉంది.ఇప్పుడు మరోసారి కూడా ఆమె అలాంటి చర్యలు చేపట్టింది అంటూ వస్తున్న వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి దీనికి నరేష్ రియాక్షన్ ఇస్తాడో లేదో చూడాలి.