నరేష్ సీనియర్ నటుడు, పవిత్రల వ్యవహారం గత ఏడాది నుంచి వైరల్ అవుతుంది.. వారిద్దరి మధ్య నిజంగానే ఎఫైర్ నడుస్తుంది.. మూడో భార్య రమ్య రఘుపతి ఆయన మీద తీవ్ర ఆరోపణలు చేశారు.. అందుకు సంబందించిన వార్తలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యాయో మనం చూస్తూనే ఉన్నాం.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన ట్రైలర్స్, పోస్టర్స్ కొందరు జనాలను ఆకట్టుకుంటే, మరి కొందరు జనాల తో విమర్శలు అందుకున్నాయి.. ఇప్పటివరకు విడుదలైనవి ఒక ఎత్తు, ఇప్పుడు రిలీజ్ అయ్యింది ఒక ఎత్తు.. ఈ సినిమా నుంచి తాజాగా విడుదలైన ట్రైలర్ జనాలను ఆలోచనలో పడేస్తుంది..
రమ్య రఘుపతి ఆరోపణలకు నరేష్ స్పందించారు. ఆమె మీద ఘాటైన విమర్శలు చేశారు. ఒకరిపై మరొకరు వ్యక్తిత్వ దాడి చేసుకున్నారు. చెప్పాలంటే నరేష్-పవిత్ర లోకేష్-రమ్య రఘుపతి కేంద్రంగా అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ మొత్తం ఉదంతాన్ని నరేష్ మూవీగా ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. గతంలో జరిగిన సంఘటనలు కూడా కలిపి కంప్లీట్ ఫ్యామిలీ డ్రామా చేశారు..వ్యక్తిగత జీవితంలోని కాంట్రవర్సీని స్వయంగా సినిమా తీయడం అతిపెద్ద సాహసం. అందులోనూ సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల పాత్రలను కూడా సీన్ లోకి లాగారు. ట్రైలర్ టీజర్ పరిశీలిస్తే నరేష్ క్యారెక్టర్ కొంచెం నెగిటివ్ షేడ్స్ కలిగి ఉంది. తన వయసు మీద, శరీర పటుత్వం మీద కూడా ఆయన కామెంట్స్ చేసుకున్నారు. దానికి సంబంధించిన సీన్స్ పెట్టారు. ట్రైలర్ లో భార్య రమ్య రఘుపతిని కాలితో తన్నినట్లు కూడా ఓ సన్నివేశం చూడొచ్చు..
ట్రైలర్ మొత్తం డబుల్ మీనింగ్ డైలాగులు ఎక్కువగా వినిపిస్తాయి..కారు ఊగడాలు వంటి బోల్డ్ సీన్స్ ఉన్నాయి. నరేష్ మొత్తంగా ఏదో పెద్ద సంచలనానికే పూనుకున్నాడనిపిస్తుంది. ఈ మూవీకి ఖచ్చితంగా మంచి ఓపెనింగ్స్ వస్తాయి. నరేష్ తనని తాను ప్రోమోలలో తప్పుగా ప్రొజెక్టు చేసి, సినిమాలో అసలు విషయం రివీల్ చేయవచ్చు. స్క్రీన్ ప్లే మ్యాజిక్ లో భాగంగా రమ్య రఘుపతి నిజ స్వరూపం ఇది అని చూపించే ప్రయత్నం చేశారు..మొత్తంగా మళ్ళీ పెళ్లి రానున్న కాలంలో సంచలనాలకు, వివాదాలకు వేదిక కావడం ఖాయం. ఎమ్ ఎస్ రాజు ఈ చిత్ర దర్శకుడు. నరేష్ స్వయంగా నిర్మించారు. వనిత విజయ్ కుమార్ కీలక రోల్ చేశారు. శరత్ బాబు కృష్ణగా, జయసుధ విజయ నిర్మలగా నటించారు. మే 26న మళ్ళీ పెళ్లి ప్రేక్షకుల ముందుకు రానుంది..ఇక ఎలా ఉంటుందో చూడాలి..