Nani : సూపర్ స్టార్ మూవీలో న్యాచురల్ స్టార్.. 20నిమిషాలకు ఎన్ని కోట్లో తెలుసా?

- Advertisement -

Nani : సౌతిండియా సూపర్ స్టార్ రజినీకాంత్ తాజా చిత్రంలో న్యాచురల్ స్టార్ నాని అతిథి పాత్ర చేయబోతున్నారన్న వార్తలు గతవారం నుంచి హల్ చల్ చేస్తున్నాయి. నాని కూడా ఈ వార్తలను నిజం చేస్తూ గెస్ట్ పాత్రకు ఒప్పుకున్నాడని తెలుస్తోంది. ఈ వార్త విన్న ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇద్దరు స్టార్లు ఓ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన వారే. వారిద్దరు కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం కనుల పండువలా ఉంటుందని సంబరపడుతున్నారు. ‘జై భీమ్’ ఫేం టీజీ జ్ఞానవేల్‌ దర్శకత్వంలో రజినీకాంత్ ఒక సినిమా చేయనున్నారు. ఆ సినిమాలో నాని ఓ పాత్ర పోషించనున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా కోసం ఇప్పటికే
రజినీకాంత్‌కు లుక్ టెస్ట్ కూడా పూరయ్యిందట.

Nani
Nani

నాని దసరాతో పాన్ ఇండియా లెవల్లో సూపర్ హిట్ కొట్టాడు. ప్రస్తుతం తాను పాన్ ఇండియా మార్కెట్ ను పెంచుకునే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమాతో నానికి తమిళంలో కూడా క్రేజ్ తెస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. రజనీకాంత్ ప్రస్తుతం జైలర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇటీవలే విడుదలైన ట్రైలర్ న బూతో న భవిష్యత్ అనే విధంగా ఉంది. ప్రేక్షకుల నుంచి హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది. దీని తర్వాత టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నాడు. తలైవర్ 170 వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ ప‌ట్టాలెక్క‌బోతోంది. అంటే రజినీ కాంత్ కు ఇది 170వ సినిమా. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో క‌థ‌ను మ‌లుపు తిప్పే పాత్ర‌లో నాని క‌నిపిస్తాడ‌ట.. దాదాపు ఇరవై నిమిషాల‌ పాటు ఆయన రోల్ ఉంటుదని తెలుస్తోంది. అయితే ఈ మూవీకి నాని రెమ్యున‌రేష‌న్ భారీగా అడుగుతున్నాడట. ఏకంగా రూ. 10 కోట్లు ఛార్జ్ చేస్తున్నాడట‌. అందుకు తలైవర్ 170 నిర్మాతలకు కూడా ఒప్పుకున్నార‌ట‌. ఏదేమైనా అంత కొద్ది సమయానికి పది కోట్లంటే కాస్త ఆలోచించాల్సిందే.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here