Nagendra Babu మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటించిన ‘ఆరెంజ్’ చిత్రం ఆ రోజుల్లో ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.మగధీర వంటి భారీ ఇండస్ట్రీ హిట్ తర్వాత రామ్ చరణ్ నుండి వచ్చిన సినిమా కావడం, దానికి తోడు అప్పటి యూత్ కి ఈ సినిమా బాగా అడ్వాన్స్ అవ్వడం వల్ల అప్పట్లో డిజాస్టర్ అయ్యింది.విడుదలకు ముందు పాటలు కూడా సెన్సేషనల్ హిట్ అవ్వడం, అవి మూవీ పై ఎవ్వరు అందుకోలేని రేంజ్ అంచనాలకు రీచ్ అవ్వడం కూడా ఆరోజుల్లో ఈ సినిమా పెద్ద ఫ్లాప్ అవ్వడానికి కారణం అయ్యింది.ఇక ఈ సినిమా నిర్మాత నాగబాబు అయితే తీవ్రమైన అప్పులపాలయ్యాడు.ఫైనాన్షియర్స్ నుండి ఒత్తిడి తట్టుకోలేక అప్పట్లో ఆయన ఆత్మహత్యాప్రయత్నం కూడా చేసాడు.పవన్ కళ్యాణ్ తన ఇల్లుని తాకట్టు పెట్టి నాగబాబు అప్పులను తీర్చి ఆయనని నష్టాల ఊబిలో నుండి బయటకి లాగాడు.

అలా ఆరోజుల్లో నాగ బాబు కి పీడకల లాగ నిల్చిన ఈ చిత్రం, రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఇటీవలే రీ రిలీజ్ అయ్యింది.రెస్పాన్స్ ఎవ్వరు ఊహించని రేంజ్ లో వచ్చింది,ఒక్కమాటలో చెప్పాలంటే రీసెంట్ గా కొత్త సినిమాలకు కూడా వర్కింగ్ డేస్ లో హౌస్ ఫుల్స్ పడడం లేదు.అలాంటిది ఆరెంజ్ సినిమాకి నాన్ స్టాప్ గా హౌస్ ఫుల్స్ పడుతూనే ఉన్నాయి.ఇది నాగబాబు తో పాటుగా రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా ఊహించలేకపోయారు.ఇప్పటి వరకు సుమారుగా రెండు కోట్ల 70 లక్షల రూపాయిల గ్రాస్ ని సాధించిన ఈ సినిమా , రీ రిలీజ్ లలో ఆల్ టైం టాప్ 3 రేంజ్ లో నిలిచింది.ఒక డిజాస్టర్ సినిమా రీ రిలీజ్ అయితే ఈ రేంజ్ సక్సెస్ సాదిస్తుందని ట్రేడ్ పండితులు సైతం అంచనా వేయలేకపోయారు.

ఈ సినిమా అలా సక్సెస్ సాధించడానికి చాలా కారణాలే ఉన్నాయి,అందులో మొదటిది ఈ సినిమాకి వచ్చే కలెక్షన్స్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఫండ్స్ కోసం ఇస్తున్నామని ప్రకటించారు.అక్కడ నుండే ఈ సినిమాకి విపరీతమైన సపోర్టు మొదలైంది.ఇక ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి గ్లోబల్ స్టార్ ఇమేజి వచ్చిన ఊపులో చరణ్ ఫ్యాన్స్ ఉన్నారు, అది కూడా ఈ సినిమాకి ఇంత వసూళ్లు రావడానికి కారణం అయ్యింది.ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సోషల్ మీడియా వృద్ధిలోకి వచ్చిన తర్వాత ఒక రేంజ్ క్రేజ్ వచ్చింది.ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు అంటే యూత్ కి పిచ్చి, అది కూడా ఈ చిత్రం రీ రిలీజ్ లో సక్సెస్ సాధించడానికి కారణం అయ్యింది.ఏది ఏమైనా ఆరెంజ్ చిత్రం రీ రిలీజ్ లో అద్భుతాలే సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతుంది.
