బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ ఎట్టకేలకు ఘనంగా ప్రారంభమైంది. ఈ సీజన్‍కు సంబంధించి ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్డేట్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. బిగ్ బాస్ 7 తెలుగు సీజన్‍లోకి మొత్తంగా 20 మంది ఇంటి సభ్యులుగా పాల్గొననున్నారు. వీరిలో పది ఒక టీమ్, మరో 10 మందిని మరో టీమ్ గా రెండు భాగాలుగా విడదీయనున్నారని టాక్. ఇక ఎవరూ ఊహించని సీజన్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ అంటూ నాగార్జున ప్రోమోలు, ప్రమోషన్స్ లలో చెబుతూ వచ్చాడు. సెప్టెంబర్ 2న బిగ్ బాస్ తెలుగు 7 హౌజ్ చూపిస్తూ ప్రోమో విడుదల చేయగా తాజాగా నాగార్జున, గెస్టులు విజయ్ దేవరకొండ, నవీన్ పోలిశెట్టి, కంటెస్టెంట్స్ ఎంట్రీలను చూపించారు.

అయితే కంటెస్టెంట్స్ ముఖాలు చూపించకుండా కేవలం డైలాగ్స్ తో ప్రోమో ద్వారా ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. ఇక ఖుషి ప్రమోషన్స్ లో భాగంగా స్టేజీపైకి వచ్చిన విజయ్ దేవరకొండ తన సినిమాలోని ఆరాధ్య పాటకు స్టెప్పులేశాడు. విజయ్ దేవరకొండ డ్యాన్స్ తర్వాత అతన్ని “ఏది మీ హీరోయిన్ ఎక్కడ సమంత” అని నాగార్జున అడిగారు. నాగార్జున అలా అడగడంతో విజయ్ దేవరకొండ నవ్వుతూ చూశాడు. తర్వాత నవీన్ పోలిశెట్టి ఎంట్రీ ఇచ్చి తనదైన స్టైల్‍లో డైలాగ్ చెప్పి ఆకట్టుకున్నాడు.

అనంతరం “ప్రతి సీజన్‍లో ఫినాలేలో వచ్చే బ్రీఫ్ కేస్ మీకు సీజన్ 7లో ఫస్ట్ ఫైవ్‍కే (ఐదుగురు ఇంటి సభ్యులకు) వస్తుంది. ఆ డబ్బు తీసుకుని హౌజ్ నుంచి ఇప్పుడే వెళ్లిపోవచ్చు” అని నాగార్జున షో ఎంట్రీలోనే కంటెస్టెంట్స్ కు పెద్ద ట్విస్ట ఇచ్చాడు. ఆ బ్రీఫ్ కేస్ కోసం ఇంటి సభ్యులు కిందా మీద పడుతూ పోటీ పడటం ప్రోమోలో చూపించారు. అది చూసి నాగార్జున మంచి స్మైల్ ఇస్తూ ఉన్నాడు.