శివ నిర్వాణ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్1న గ్రాండ్‌గా విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో స్క్రీనింగ్ అవుతోంది.గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ మళ్లీ ఆ రేంజ్ సక్సెస్ అందుకోవడంతో సెలబ్రేషన్ మూడ్‌లో ఉన్నాడు విజయ్ దేవరకొండ.

ఐదేళ్ల తర్వాత విజయ్ దేవరకొండకు మళ్లీ సూపర్ హిట్ పడ్డట్టు ఇప్పటివరకు వచ్చిన రిపోర్ట్స్ చెబుతున్నాయి. లైగర్ డిజాస్టర్ తర్వాత మంచి సక్సెస్ అందుకోవడంతో విజయ్ దేవరకొండ ఫుల్ ఖుషీగా ఉన్నాడు. ఈ సినిమాకు ఇండియాలో మొదటిరోజు 15.25 కోట్లు వచ్చాయి. ఇక రెండో రోజు కూడా మంచి ఊపును కొనసాగిస్తోంది ఖుషి సినిమా. ఇదిలా ఉంటే సమంత, నాగచైతన్య ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు.

ఆ తర్వాత ఏవో కారణాల వల్ల విడిపోయి ఎవరి లైఫ్ వాళ్లు చూసుకుంటున్నారు. అయితే ఖుషి సినిమా సక్సెస్ కావడంతో నాగచైతన్య కోపంతో అజ్ఞాతంలోకి వెళ్లాడని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, సమంత మధ్య రొమాంటిక్ సీన్స్ ఉండడం.. నాగచైతన్యకు కోపం తెప్పించిందట. అందుకే బయటకు వచ్చేందుకు నిరాకరిస్తున్నాడు. బయటకు వస్తే ఎవరైనా ఖుషి సినిమా గురించి అడిగితే ఎలా అని ఆలోచిస్తున్నాడట నాగచైతన్య.