టాలీవుడ్ లో స్టార్ల మధ్య రిలేషన్‌షిప్స్, పెళ్లిళ్లు, విడాకులు కొత్తేమీ కాదు. అయితే ఒకప్పుడు పవన్ కల్యాణ్, రేణు దేశాయ్.. ఈ మధ్య నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకోవడం మాత్రం సంచలనం రేపింది. ఎన్నో రోజుల పాటు అభిమానులకు హాట్ టాపిక్ గా మారిన వార్తలు ఇవి. ముఖ్యంగా పవన్, రేణు బంధం ముగిసిన తీరు చాలా మందిని షాక్ కు గురి చేసింది. పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత మనస్పర్ధలు వల్ల విడిపోయారు.

వీళ్లిద్దరూ విడిపోవడానికి నాగబాబు కారణమని తాజాగా వార్తలు వరోసారి ఊపందుకున్నాయి. అంతేకాదు ఆ హీరో వల్లే పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ విడిపోయారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అసలు విషయంలోకి వెళ్తే రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ లు విడిపోవడానికి ప్రధాన కారణం పవన్ అన్న నాగబాబు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే నాగబాబు రామ్ చరణ్ తో కలిసి ఆరంజ్ అనే సినిమా తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమా అట్టర్ ప్లాఫ్ అయ్యి నిర్మాతగా వ్యవహరించిన నాగబాబుని నష్టాల్లో ముంచేసిందిని అప్పట్లో టాక్ వినిపించింది. అంతేకాదు ఈ సినిమా నిర్మించాక అప్పుల బాధతో నాగబాబు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారని వార్తలు వినిపించాయి.

కానీ అలాంటి టైంలో పవన్ కళ్యాణ్ నాగబాబుకి హెల్ప్ చేశారట. తన దగ్గర ఉన్న డబ్బుని నాగబాబుకి ఇచ్చి కొంత అప్పు ని తీర్చారట. కానీ ఈ విషయం తెలుసుకున్న రేణు దేశాయ్ మన భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఉన్న డబ్బులన్నీ అలా మీ అన్నకి ఇచ్చేస్తే మన పిల్లల భవిష్యత్తు ఏం కావాలి అని గొడవ పెట్టుకుందని కొన్ని వెబ్ సైట్లలో వార్తలు వచ్చాయి.ఇక ఈ విషయంలో ప్రతిరోజు పవన్ కళ్యాణ్ కి రేణు దేశాయ్ కి మధ్య గొడవలు రావడంతో కలిసి ఉండే కంటే విడిపోవడం బెటర్ అని విడిపోయారని గుసగుసలు వచ్చాయి. ఉన్నట్లుండి మరోసారి ఈ విషయం ఇప్పుడు తెరపైకి వచ్చి వైరలవుతోంది.