Varun Tej : వరుణ్ తేజ్ పుట్టినరోజు నాడు చెయ్యకూడని పని చేసిన లావణ్య త్రిపాఠి..కోపం తో రగిలిపోయిన నాగబాబు!



Varun tej : మెగా బ్రదర్ నాగబాబు కొడుకుగా ఇండస్ట్రీ లోకి వచ్చిన వరుణ్ తేజ్ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజి ని ఏర్పాటు చేసుకున్నాడు. కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ని కొట్టి హీరో గా నిలదొక్కుకున్న ఆయన ఇటీవలే 33 వ సంవత్సరం లోకి అడుగుపెట్టాడు. ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి తో పెళ్లి తర్వాత ఆయన చేసుకున్న మొట్టమొదటి పుట్టిన రోజు ఇది.

ఈ పుట్టినరోజు కి సంబంధించి ఫోటోలు వీడియోలు , ఫోటోలను కూడా లావణ్య త్రిపాఠి ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేసి వరుణ్ తేజ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేసింది. అయితే వరుణ్ తేజ్ పుట్టినరోజు నాడు చేసిన ఒక చిన్న పొరపాటు వల్ల నాగబాబు కి చాలా కోపం వచ్చిందట. చెప్పినా కూడా వినలేదని మండిపడ్డాడు అట. అదేంటో ఒకసారి చూద్దాం.

వరుణ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా నాగబాబు వాళ్లిద్దరూ కాసేపు ఏకాంతంగా గడిపే విధంగా ఒక వెకేషన్ ట్రిప్ కి టికెట్స్ బుక్ చేసాడట. ఈరోజు ఏమి పనులు పెట్టుకోకు అని నాగబాబు లావణ్య కి ప్రత్యేకించి చెప్పాడట కూడా. కానీ లావణ్య త్రిపాఠి కి ఆరోజు డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసే పని పడింది. ప్రస్తుతం ఆమె మిస్ పర్ఫెక్ట్ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కూడా ఇటీవలే విడుదలైంది.

బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ విన్నర్ అభిజిత్ ఈ సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ ఆర్ విహారి మరో 10 రోజులు అందుబాటులో ఉండని పరిస్థితి ఏర్పడడం తో వరుణ్ తేజ్ పుట్టిన రోజు నాడు డబ్బింగ్ చెప్పాల్సిన పరిస్థితి లావణ్య త్రిపాఠి కి వచ్చింది. దీంతో సరైన ప్లానింగ్ లేనందుకు నాగబాబు లావణ్య త్రిపాఠి పై సీరియస్ అయ్యినట్టు తెలుస్తుంది.

Tags: