కస్టడీ : అక్కినేని ఫ్యామిలీ గడిచిన కొద్దీ సంవత్సరాల నుండి చూస్తున్న డిజాస్టర్ ఫ్లాప్స్ టాలీవుడ్ లో ఒక్క మంచుకి కుటుంబానికి చెందిన హీరోలు తప్ప ఎవ్వరు చూడలేదు. అక్కినేని నాగార్జున మార్కెట్ ‘ఆఫీసర్’ సినిమాతోనే తుడిచిపెట్టుకుపోయింది. కానీ ఆయన కొడుకు నాగ చైతన్య మాత్రం ఒక సినిమా కాకపోయినా మరో సినిమాతో సూపర్ హిట్ కొట్టి అక్కినేని కుటుంబ పరువు కాపాడుతూ ఉండేవాడు.

‘బంగార్రాజు’ సినిమా వరకు ఆయనకీ వరుసగా హిట్లు వచ్చాయి, కానీ ఆయన హీరో గా నటించిన ‘థాంక్యూ’ చిత్రం గత ఏడాది విడుదలై డిజాస్టర్ గా మిగిలింది. ఈ సినిమా నుండే ఆయనకి గడ్డు కాలం ప్రారంభం అయ్యింది. ఈ సినిమా తర్వాత ఆయన హీరో గా నటించిన ‘కస్టడీ’ చిత్రం నేడు తెలుగు మరియు తమిళం బాషలలో గ్రాండ్ గా విడుదల అయ్యింది.ఈ సినిమాకి డిజాస్టర్ టాక్ అయితే రాలేదు కానీ డివైడ్ టాక్ వచ్చింది.

కానీ సినిమాకి అనుకున్న స్థాయి హైప్ లేకపోవడం తో ఓపెనింగ్స్ దారుణంగా వచ్చాయి.రీసెంట్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్స్ గా మిగిలిన ‘ఏజెంట్’ మరియు ‘శాకుంతలం’ చిత్రాలకంటే తక్కువ ఓపెనింగ్ వచ్చేలా ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ప్రతి షో కి 50 శాతం కి పైగా డ్రాప్స్ పడడమే అందుకు కారణమని అంటున్నారు.

సమంత ‘శాకుంతలం’ చిత్రానికి మొదటి రోజు ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాలలో రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి, కానీ కస్టడీ చిత్రానికి అంతకంటే తక్కువ వసూళ్లు వచ్చేలా ఉన్నాయట. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ని బట్టి చూస్తే మొదటి రోజు ఈ చిత్రానికి కోటి 85 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వస్తాయని తెలుస్తుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ 22 కోట్ల రూపాయలకు పైగా జరిగింది. ఫుల్ రన్ లో ఎంత నష్టం మిగల్చబోతుందో చూడాలి.