Naa Saami Ranga : సంక్రాంతికి ఊర మాస్ సినిమా.. సెన్సేషనల్ రెస్పాన్స్ ని దక్కించుకున్న నాగార్జున ‘నా సామి రంగ’ టీజర్!

- Advertisement -

Naa Saami Ranga : గత కొంతకాలం నుండి సరైన సూపర్ హిట్ లేక ఇబ్బంది పడుతున్న అక్కినేని నాగార్జున ని చూసి ఆయన అభిమానులు ఎంతలా డీలా పడ్డారో మన అందరికీ తెలిసిందే. నాగార్జున తో సమకాలీన స్టార్ హీరోలుగా పేరు తెచ్చుకున్న చిరంజీవి, బాలకృష్ణ వంటి వారు కమర్షియల్ మాస్ సినిమాలు చేస్తుంటే నాగార్జున మాత్రం ఇంకా ప్రయోగాత్మక చిత్రాలు చేస్తున్నాడని ఆయన అభిమానులు పలు సందర్భాలలో సోషల్ మీడియాలో అసంతృప్తి ని వ్యక్త పరిచారు.

NAgarjuna

నాగార్జున గత చిత్రాలు కనీసం 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను కూడా రాబట్టలేకపోయాయి. ఇలాంటి సమయం లో కాస్త గ్యాప్ తీసుకొని ఆయన చేసిన చిత్రం ‘నా సామి రంగ’. ‘ధమాకా’ రచయితా ప్రసన్న కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం లో నాగార్జున తో పాటుగా అల్లరి నరేష్ మరియు రాజ్ తరుణ్ ముఖ్య పాత్రలు పోషించగా, ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటించింది.

ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని కాసేపటి క్రితమే విడుదల చెయ్యగా , ఫ్యాన్స్ నుండి బంపర్ రెస్పాన్స్ ని దక్కించుకుంది. సంక్రాంతికి ఎలాంటి సినిమాని దింపాలో, అలాంటి సినిమానే నాగార్జున దింపుతున్నాడని, ఈసారి బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ గల్లంతు అవ్వాల్సిందే అంటూ ఆయన అభిమానులు ఈ టీజర్ ని చూసి సంబరాలు చేసుకుంటున్నారు. ఈ చిత్రం లో నాగార్జున లుక్స్ అదిరిపోయాయి. అసలు ఆయనకీ 65 ఏళ్ళు అంటే ఎవ్వరూ నమ్మలేరు.

- Advertisement -

ఇకపోతే అల్లరి నరేష్ మరియు రాజ్ తరుణ్ నాగార్జున కి అనుచరులుగా, లేదా తమ్ముళ్లుగా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక హీరోయిన్ ఆషిక రంగనాథ్ కి కూడా మంచి క్యారక్టర్ పడినట్టు తెలుస్తుంది. సంక్రాంతికి ఇప్పటి వరకు విడుదలైన నాగార్జున సినిమాలు దుమ్ము లేపేసాయి.. ఈ చిత్రం కూడా అదే రేంజ్ లో హిట్ కొట్టి, నాగార్జున కి కం బ్యాక్ మూవీ గా నిలుస్తుందని అభిమానులు బలంగా నమ్ముతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here