రాజ్ ని గుర్తు చేసుకుంటూ కోటి ఎమోషనల్ నోట్.. విడిపోవడానికి కారణం అదే అంటూ

- Advertisement -

ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్.. స్వర్గస్తులైన విషయం తెలిసిందే. రాజ్ పూర్తి పేరు తోటకూర సోమరాజు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజ్ మే 21 సాయంత్రం మరణించారు. గుండెపోటుతో హైదరాబాద్ లోని తన స్వగృహంలో కన్నుమూశారు. దీంతో టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. కాగా రాజ్ – కోటి సంగీత ద్వయానికి తెలుగు చిత్ర సీమలో మంచి పేరుంది. మ్యూజిక్ డైరెక్టర్ కోటితో కలిసి రాజ్ దాదాపు 180 సినిమాలకు పైగా సంగీతం అందించారు.

సంగీత దర్శకుడు కోటి
సంగీత దర్శకుడు కోటి

రాజ్ – కోటి తండ్రులు టీవీ రాజు – సాలూరి రాజేశ్వరరావు కూడా సంగీత దర్శకులే అని అందరికీ తెలిసిందే. వారిద్దరూ మంచి స్నేహితులు కావడంతో చిన్నప్పటి నుంచే రాజ్ – కోటి చాలా స్నేహంగా ఉండే వారు. దాంతో సంగీత దర్శకులుగా మరిన తర్వాత ఇద్దరూ విడివిడిగా కొన్ని సినిమాలకు పని చేసినా కానీ అనంతరం ఇద్దరు కలిసి రాజ్ – కోటి సంగీత ద్వయంగా పనిచేశారు. దాదాపు పది ఏళ్ల పాటు ఇద్దరూ కలిసి ఎన్నో సినిమాలకు సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చారు.

Music Director Raj

ఈ మేరకు రాజ్ మరణంపై కోటి ఎమోషనల్ అవుతూ వారు ఎందుకు విడిపోవాల్సి వచ్చిందో అని ఓపెన్ అయ్యారు. నా రాజ్ చనిపోయారన్న వార్త నేను జీర్ణించుకోలేకపోతున్నాను ఇటీవల కాలంలో ఒక ఫంక్షన్ లో కలిసాము ఆయన అనారోగ్యంతో ఉన్నట్టు నాకు అసలు అనిపించలేదు రాజు కూడా చెప్పలేదని అన్నారు. మేమిద్దరం పరిస్థితుల కారణంగా విడిపోవాల్సి వచ్చిందని తెలిపారు. అయితే నేను విడిపోయే సమయంలో రాజు వద్దురా విడిపోవద్దు అని బ్రతిమలాడారు. అయితే పరిస్థితులు నన్ను వేరు చేశాయని, కానీ వేమిద్దరం పాటల రూపంలో ఎప్పటికీ కలిసి ఉంటాము అంటూ తెలిపారు. ఇక కోటి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

- Advertisement -

చివరిసారిగా ఇటీవలే బేబీ సినిమాలోని ఓ సాంగ్ లాంచ్ కి విచ్చేశారు. బేబీ సినిమాలోని దేవరాజా అనే సాంగ్ లాంచ్ ఇటీవల జరగగా సినీ పరిశ్రమలోని సీనియర్ సంగీత దర్శకులు చాలా మందిని ఆహ్వానించారు. వారిలో రాజ్ కోటి కూడా ఉన్నారు. చాలా రోజుల తర్వాత రాజ్ కోటి బయట ఒక ఈవెంట్ లో కలిసి కనిపించారు. ఈ ఈవెంట్ లో రాజ్ కోటి పక్కన కూర్చొని కనిపించారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here