Murali Mohan : ప్లానింగ్ లేకపోవడం వల్లే సినిమాలు లేటవుతున్నాయి… త్రివిక్రం పై మురళీమోహన్ షాకింగ్ కామెంట్స్…

murali mohan trivikram


Murali Mohan : త్రివిక్రమ్ మరియు మహేష్ కాంబినేషన్లో రాబోతున్న మూడవ చిత్రం గుంటూరు కారం. ఇంతకుముందు వీరిద్దరి కాంబినేషన్లో అతడు మరియు ఖలేజా చిత్రాలు వచ్చిన సంగతి తెలిసినదే. అయితే అతడు సినిమా షూటింగ్ పూర్తి కావడానికి రెండు సంవత్సరాల సమయం పడితే… ఖలేజా పూర్తయ్యేసరికి ముచ్చటగా మూడు సంవత్సరాలు పట్టింది.

murali mohan mahesh babu
murali mohan mahesh babu

ఇప్పుడు ఇదే గుంటూరు కారం విషయంలో కూడా జరగవచ్చు అన్న అభిప్రాయాలు అక్కడక్కడ వినిపిస్తున్నాయి.అసలు అతను సినిమా అంతా ఆలస్యం అవ్వడానికి కారణం ఏమిటా అంటే…సరియైన ప్లానింగ్ లేకపోవడం అని ఒక ఇంటర్వ్యూలో అతడు సినిమా ప్రొడ్యూసర్లలో ఒకరైన మురళీమోహన్ అన్నారు. జనరల్ గా తాను తీసే ఏ చిత్రమైనా ఆరు నెలల వ్యవధిలో పూర్తి అవుతుందని.. తమ ప్లానింగ్ అలా ఉంటుందని ఆయన అన్నారు.

mahesh babu trivikram srinivas

కానీ రెండవ సినిమాకే త్రివిక్రమ్ తన స్టైల్ లో మూవీ తీస్తానని ..అన్ని నేనే చూసుకుంటాను అని సినిమా లేట్ చేశాడు అనేది మురళీమోహన్ అభిప్రాయం.మరోపక్క ఖలేజా సినిమాకి సంబంధించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న మహేష్ బాబు.. ఏ మూవీ షూటింగ్ కి చాలా టైం పట్టింది అని అడిగినప్పుడు షాకింగ్ సమాధానం ఇచ్చారు.షూటింగ్ రెండు మూడు నెలలు జరిగిన తర్వాత మళ్లీ ఒక లాంగ్ బ్రేక్ వచ్చేదని ఆయన పేర్కొన్నారు.

అంటే ఇన్ డైరెక్ట్ గా మహేష్ కూడా త్రివిక్రమ్ ప్లానింగ్ గురించి మాట్లాడినట్టే అని నటిజన్స్ భావిస్తున్నారు. ట్విస్ట్ ఏమిటంటే మహేష్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అతనితోపాటు త్రివిక్రమ్ కూడా అక్కడే ఉన్నాడు. ప్రస్తుతం గుంటూరు కారం ఏదో ఒక విషయంలో న్యూస్ లో వైరల్ అవుతూనే వస్తుంది.

ఒకసారి పూజా మూవీలో ఉండటం లేదంటే ఇంకొకసారి తమన్ వెళ్ళిపోతున్నారంటే.. ఇలా ఏదో ఒక ఇష్యూ జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ మూవీ అంటే అలాగే ఉంటుంది అంటూ ఎప్పుడో మరుగున పడిన ఈ పాత వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

Tags: