OTT Movies : కొన్ని సినిమాలు థియేటర్స్ లో సంచలన విజయాలుగా నిలిచి టీవీ టెలికాస్ట్ లో మాత్రం అట్టర్ ఫ్లాప్ గా నిలుస్తాయి.అలా ఇప్పుడు రీసెంట్ గా విడుదలైన కొన్ని సినిమాలు థియేటర్స్ లో దుమ్ములేపాయి, కానీ ఓటీటీ లోకి వచ్చిన తర్వాత ‘ఈ చెత్త సినిమాని ఎలా హిట్ చేసారు రా బాబు’ అని అనుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి.అలా అనిపించినా చిత్రాలన్నీ OTT Movies లో వ్యూస్ పరంగా కూడా మిశ్రమ స్పందనే దక్కించుకుంది.అలా థియేటర్స్ కి బారులు తీసేలా చేసిన లేటెస్ట్ సినిమాలు, ఓటీటీ లో మాత్రం ఫ్లాప్ గా నిలిచినా చిత్రాలు ఏమిటో ఇప్పుడు మనం చూడబోతున్నాము.
భీమ్లా నాయక్ :
పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ఈ సినిమా ఎన్నో అడ్డంకుల్ని ఎదురుకొని అతి తక్కువ టికెట్ రేట్స్ మీద వందకోట్ల రూపాయిల షేర్ ని రాబట్టిన సినిమాగా నిలిచింది.కానీ ఈ చిత్రం కేవలం ఒక సెక్షన్ ఆడియన్స్ మాత్రమే చూసేవిధంగా ఉండడం, ఫ్యామిలీ ఆడియన్స్ కి ఏమాత్రం నచ్చకపోవడం తో ఈ సినిమాకి ఓటీటీ లో మిశ్రమ స్పందనే లభించింది.ఆహా మరియు డిస్నీ + హాట్ స్టార్ స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రానికి మంచి వ్యూస్ అయితే వచ్చాయి కానీ అది పవన్ కళ్యాణ్ రేంజ్ కి తగినవి కాదు.
సర్కారు వారి పాట:
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన ఈ చిత్రం కూడా తొలుత యావరేజ్ టాక్ తో ప్రారంభమైన ఈ చిత్రం చిన్నగా టాక్ స్థిరపడి బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ సక్సెస్ గా నిలిచింది.కానీ ఓటీటీలో విడుదులైన తర్వాత మాత్రం మిశ్రమ స్పందనే వచ్చింది.ఈ చిత్రానికి యూత్ ఆడియన్స్ నుండి పెద్దగా సపోర్టు రాకపోయినా ఫ్యామిలీ ఆడియన్స్ నుండి మాత్రం అదిరిపొయ్యే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది.కానీ ఓవరాల్ గా చూసుకుంటే ఓటీటీ లో మిశ్రమ స్పందనే లభించింది.
సైరా నరసింహా రెడ్డి :
మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ఈ ప్రీ ఇండిపెండెన్స్ పీరియాడిక్ డ్రామా థియేట్రికల్ పరంగా ఎంత పెద్ద భారీ బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే.ఇప్పటికీ ఈ సినిమా వసూళ్లను మన స్టార్ హీరోలెవరు కూడా అందుకోలేకపోయారు.అలాంటి సినిమాకి ఓటీటీ లో మాత్రం మిశ్రమ స్పందన రావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
కాంతారా:
అతి చిన్న సినిమాగా విడుదలైన కాంతారా కన్నడ చిత్రం,పాన్ ఇండియన్ సినిమాగా అవతరించి తెలుగు , హిందీ , కన్నడం , మలయాళం మరియు తమిళం బాషలలో సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో అందరికీ తెలుసు.సుమారుగా 450 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది.థియేటర్స్ లో ఆ రేంజ్ అద్భుతాలను సృష్టించిన ఈ సినిమాకి ఓటీటీ లో మాత్రం ఆ రేంజ్ రెస్పాన్స్ రాలేదు.మంచి రెస్పాన్స్ అయితే కచ్చితంగా వచ్చింది కానీ, థియేటర్స్ లో ఆడినంత ఓటీటీ లో ఆడలేదు.