Mounika Reddy : సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయి. ఏళ్ల తరబడి ప్రేమలో ఉండి.. మరికొన్నేళ్లు సహజీవనం చేసి.. ఎట్టకేలకు అడ్డంకులన్నీ తొలగిబోయి.. అంగరంగ వైభంగా డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకుంటోన్న సినిమా నటీనటులు.. ప్రేమలో ఉన్నన్ని రోజులు కూడా పెళ్లి బంధంలో ఇమడలేకపోతున్నారు. సినిమా ఇండస్టీకి చెందిన వాళ్లు.. అదే ఇండస్ట్రీలో వాళ్లని వివాహమాడినా.. లేక బయట వారిని పెళ్లి చేసుకున్నా.. ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు విడాకుల దారిలో నడిచిన విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి మరో నటి చేరబోతోందన్న వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నారు. ఇంతకీ ఆమె ఎవరంటే..

నటి మౌనిక రెడ్డి.. అంటే కొంతమందికే తెలుస్తుంది కానీ యూట్యూబర్.. ముఖ్యంగా సూర్య అనే వెబ్ సిరీస్ హీరోయిన్ అంటే మాత్రం ఇట్టే గుర్తు పట్టేస్తారు. మౌనిక రెడ్డి గతేడాది గోవాలో తన బాయ్ ఫ్రెండ్ సందీప్ ను గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ పద్ధతిలో వివాహమాడింది. అప్పట్లో ఈ జంట పెళ్లి ఫొటోలు నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఇదో ఫెయిరీ టైల్ పెళ్లని అప్పుడు నెటిజన్లు భావించారు. ఈ జంటను చూసి నెట్టింట కంగ్రాట్స్ చెబుతూ కామెంట్లు చేశారు. పెళ్లయ్యాక కొన్ని రోజులు బాగానే ఉన్న ఈ జంట తాజాగా విడాకులు తీసుకోబోతున్నారట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఈ వార్త ఎందుకు వైరల్ అవుతోందంటే.. దానికో బలమైన కారణం ఉందట. అదేంటంటే..
మౌనిక రెడ్డి తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఉన్న పెళ్లి ఫొటోలు, వీడియోలు డిలీట్ చేసిందట. అంతే కాకుండా తన భర్త సందీప్ ను అన్ ఫాలో చేసిందట. ఇది చూసిన నెటిజన్లు మౌనిక రెడ్డి విడాకులు తీసుకోబోతోందంటూ ప్రచారం చేస్తున్నారు. ఇప్పటి వరకు విడాకులు తీసుకున్న సెలబ్రిటీలు చాలా మంది ఇలా మొదటగా తమ సోషల్ మీడియా ఖాతాల్లో ఒకర్నొకరు అన్ ఫాలో చేసిన వారే.

ఇప్పుడు మౌనిక కూడా ఇలా చేయడంతో ఈ జంట కూడా విడాకులు తీసుకోబోతోందంటూ ప్రచారం మొదలైంది. మరి మౌనిక రెడ్డి నిజంగానే విడాకులు తీసుకుంటుందా లేదా అనేది తెలియాలంటే స్వయంగా ఆమె క్లారిటీ ఇచ్చేవరకు వేచి చూడాల్సిందే.
ఇక మౌనిక రెడ్డి గురించి చెప్పుకుంటే.. షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ ల ద్వారా సోషల్ మీడియాలో ఫేమస్ అయి ప్రస్తుతం టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకుంది. ఈమెకు ఎక్కువ గుర్తింపు వచ్చింది మాత్రం భీమ్లానాయక్ సినిమా ద్వారా. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పక్కనే లేడీ కానిస్టేబుల్ లో చాలా ఎమోషన్స్ పండించింది మౌనిక. ఇక ఈమె షణ్ముఖ్ జస్వంత్ హీరోగా చేసిన సూర్య వెబ్ సిరీస్ ఎంతటి హిట్టో అందరికీ తెలిసిందే. ఆ వెబ్ సిరీస్ రిలీజ్ అయిన కొత్తలో చాలా మంది యువకులు తమకు ఇలాంటి గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది అని అనుకున్నారు. ఇక భీమ్లానాయక్ సినిమాతో ఆ తర్వాత ఈ బ్యూటీకి సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి. అయితే సినిమాల్లో నటించడం వల్లే ఈ ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి ఉంటాయేమోనని నెటిజన్లు భావిస్తున్నారు.