Bigg Boss Telugu 7 లో ‘పవర్ అస్త్ర’ ని గెలవని కంటెస్టెంట్స్ వచ్చే వారం ఎలిమినేట్ అవ్వబోతున్నారా? ఇదేమి ట్విస్ట్ సామీ!

- Advertisement -

Bigg Boss Telugu 7 : ప్రతీ రోజు స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 7 ఎంత ఆసక్తికరంగా ముందుకు దూసుకుపోతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఈ సీజన్ లో హోస్ట్ అక్కినేని నాగార్జున మొదటి ఎపిసోడ్ నుండే ‘పవర్ అస్త్ర’ ప్రత్యేకత గురించి చెప్తూ వచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ లో సందర్భాలు మొత్తం ‘ఉల్టా పల్టా’ అయ్యేది ఈ పవర్ అస్త్ర వల్లే అని చెప్పాడు.

bigg boss telugu
bigg boss telugu

ఆటలోకి వెళ్లిన తర్వాత ఈ పవర్ అస్త్ర అంటే ఏమిటి, దానికి ఉన్న పవర్స్ ఏమిటి అనేవి తెలిసాయి. నామినేషన్స్ నుండి ఇమ్యూనిటీ దక్కించుకోవడమే ఈ పవర్ అస్త్ర కి ఉన్న పవర్. ఇది దక్కే వరకు బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ మొత్తం కేవలం కంటెస్టెంట్స్ మాత్రమే, ఇంటి సభ్యులు కాదు. ఇప్పటి వరకు పవర్ అస్త్ర ని శివాజీ , పల్లవి ప్రశాంత్ , శోభా శెట్టి మరియు సందీప్ గెలిచి ఇంటి సభ్యులు అయ్యారు.

Pallavi Prashanth

కానీ శివాజీ నిన్న ఇంటి సభ్యుల ద్వారా అనర్హుడు అనే ముద్ర వేసుకొని పవర్ అస్త్ర ని వదులుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆయన కేవలం ఒక కంటెస్టెంట్ మాత్రమే. ఇదంతా పక్కన పెడితే ఈ వారం ఇప్పటి వరకు పవర్ అస్త్ర ని గెలుచుకోని కంటెస్టెంట్స్ మొత్తం ఎలిమినేట్ కాబోతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. చాలా రోజుల నుండి ఈ సీజన్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఉంటుంది అని అందరూ అంటూ ఉన్నారు.

- Advertisement -
Bigg Boss Telugu
Bigg Boss Telugu

బిగ్ బాస్ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా 7 మంది కంటెస్టెంట్స్ వస్తున్నారు అట. ఈ 7 మంది ఎప్పుడు వస్తారంటే, ఇప్పటి వరకు పవర్ అస్త్ర ని గెలుచుకోకుండా ఇంటి సభ్యులు కాని కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యినప్పుడే అట. అలా ఈ వీకెండ్ నాగార్జున ఆడియన్స్ కి మరియు కంటెస్టెంట్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయే రేంజ్ ట్విస్ట్ ని ఇవ్వబోతున్నట్టు టాక్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here