Mohan Babu గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నారు మోహన్ బాబు. మోహన్ బాబు ఇండస్ట్రీ లోకి రావాలని మొదట అనుకున్నప్పుడు తన తండ్రికి చెప్పారు. కానీ తన తండ్రి మాత్రం వద్దని చెప్పారు అయినా సరే మోహన్ బాబు ఏ మాత్రం వినకుండా తనకి ఉన్న టాలెంట్ తో ఇండస్ట్రీ లోకి వచ్చారు. ఆయన చేస్తున్న ఉద్యోగాన్ని కూడా వదిలేసుకుని ఇండస్ట్రీలోకి వచ్చారు. తర్వాత నెమ్మది నెమ్మదిగా ఆయనకి అవకాశాలు వచ్చాయి. అలా ఇండస్ట్రీలో స్థిరపడ్డారు మోహన్ బాబు. మోహన్ బాబు హీరోగా చేసిన తర్వాత కొన్నాళ్ళకి అవకాశాలు రాలేదు.

తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించారు. ఇక ఇది ఇలా ఉంటే మోహన్ బాబు కి సంబంధించిన వార్తలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వస్తూనే ఉంటాయి. తాజాగా మనవరాలు పాటకి మోహన్ బాబు కంటతడి పెట్టుకున్నారు అది వైరల్ గా మారింది. మోహన్ బాబు మనవరాలు ఇంగ్లీష్ లో ఒక పాట పాడింది. ఆ పాటకి మోహన్ బాబు కండతడి పెట్టుకున్నారు. వండర్ఫుల్ గర్ల్ అంటూ మోహన్ బాబు ప్రశంసలతో ముంచేశారు.
మనవరాలు అరియానా పాటకి మోహన్ బాబు స్పందిస్తూ నీకు మీ తాత మోహన్ బాబు గొంతు వచ్చింది. గ్రేస్ వచ్చిందంటూ మెచ్చుకున్నారు. అందుకనే అంత ధైర్యంగా పాడుతున్నావని అరియానని ప్రశంసించారు మోహన్ బాబు. ప్రస్తుతం మనవరాలి అరియనా పాటకి మోహన్ బాబు ఫిదా అయిపోయిన నెట్టింట షికార్లు కొడుతోంది. అందరూ మోహన్ బాబు మనవరాలు పాడిన పాట వీడియోని విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఆమె ఇంగ్లీష్ పాటకి అందరూ ఫిదా అయిపోతున్నారు. అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆమెని ఎంతగానో మెచ్చుకున్నారు. మరి ఈ వీడియో పై మీరు కూడా ఒక లుక్ వేసేయండి.