Kiara Advani : బ్లూ కలర్ కటౌట్ గౌనులో కియారా అడ్వాణీ.. కైపెక్కించే పోజులతో మెస్మరైజింగ్ ఫొటోషూట్

- Advertisement -

Kiara Advani .. ఈ బాలీవుడ్ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే, పాన్ ఇండియా స్టార్ రామ్​చరణ్​తో వినయ విధేయ రామ, సూపర్ స్టార్ మహేశ్ బాబుతో భరత్ అనే నేను సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ భామ అందం, అభినయానికి కుర్రాళ్లు ఫిదా అయ్యారు. ఇక బాలీవుడ్​లో ఈ బ్యూటీ వరుస సినిమాలు చేస్తూ సూపర్ హిట్​లు ఇస్తూ బాక్సాఫీస్ క్వీన్​గా మారిపోయింది. ఈ మధ్య ఈ భామ ఏ సినిమా చేసినా సూపర్ హిట్ అవుతోంది. ఇక సోషల్ మీడియాలో ఈ భామ రచ్చ మామూలుగా ఉండదు.

Kiara advani Photos
Kiara advani Photos

కియారా బీ టౌన్​లో ఓ స్టైల్ ఐకాన్. తనకు సరిపడే ఔట్​ఫిట్స్​ను సెలెక్ట్ చేసుకోవడంలో, వాటిని కాన్ఫిడెంట్​గా ధరించడంలో కియారాను మించిన బ్యూటీ లేదు. ఈ భామ ఏ ఔట్​ఫిట్​లోనైనా సరే తనను తాను క్యారీ చేసుకునే విధానానికి టీనేజ్ అమ్మాయిలు ఫిదా అవుతుంటారు. ఇక తాజాగా కియారా స్కై బ్లూ కలర్ కటౌట్ ఫ్రాక్​లో మెరిసింది. ఈ భామ ముంబయిలో నిర్వహించిన పింక్ విల్లా స్క్రీన్ అండ్ స్టైల్ ఐకాన్ -2024 అవార్డ్స్ కార్యక్రమానికి ఈ ఔట్​ఫిట్​లో అటెండ్ అయింది.

Kiara adavani Images

- Advertisement -

ఈ ఔట్​ఫిట్​లో కియారాను చూసి ఫ్యాన్స్​తో పాటు తోటి నటులు కూడా ఫిదా అయ్యారు. ఈ అట్టైర్​లో ఈ భామ సూపర్ స్టైలిష్​గా కనిపించింది. ఆ ఫొటోలు కాస్త తన సోషల్ మీడియా ఖాతా ఇన్​స్టాలో పంచుకుంది. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు మెస్మరైజ్ అవుతున్నారు. బ్లూ డ్రెస్​లో కియారా ఐస్ క్వీన్​లా ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక కుర్రాళ్లైతే కియారా అందానికి మతి పోగొట్టుకుంటున్నారు. సూపర్ హాట్ కీ.. అంటూ తమ ప్రేమనంతా కామెంట్ బాక్సుల్లో హార్ట్ అండ్ ఫైర్ ఎమోజీల రూపంలో కురిపించేస్తున్నారు.

Kiara adavani Pics

ఇక కియారా సినిమాల సంగతికి వస్తే ఈ భామ సత్య ప్రేమ్ కీ కథా, భూల్ భులయ్యా 2, గోవిందా నామ్ తేరా, జుగ్ జుగ్ జియో సినిమాలతో సూపర్ హిట్స్ అందుకుంది. ఇక తాజాగా ఈ భామ రామ్ చరణ్​తో కలిసి పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్​లో నటిస్తోంది. అంతే కాకుండా బీ టౌన్​లో బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీ అయిన డాన్ -3లో రణ్​వీర్ సింగ్ సరసన జత కడుతోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here