Siva Shakthi Datta : RRR చిత్రానికి ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ క్యాటగిరిలో ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు రావడాన్ని ప్రతీ భారతీయుడు ఎంతో అనందం తో సంబరాలు చేసుకుంటున్నారు .డైరెక్టర్ రాజమౌళి విజన్, ఎన్టీఆర్ – రామ్ చరణ్ అద్భుతమైన డ్యాన్స్ మరియు ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కోరియోగ్రఫీ వల్ల ఈ పాటకి ఆ రేంజ్ రీచ్ వచ్చింది.కానీ వీళ్ళెవ్వరికి అవార్డు రాకుండా , కీరవాణి మరియు చంద్రబోస్ లకు అవార్డు రావడం పై పలువురు అభ్యంతరం వ్యక్త పరిచారు.
‘నాటు నాటు’ పాటలో హీరోలిద్దరి డ్యాన్స్ తీసేసి కేవలం పాట విని చూస్తే చాలా మామూలు యావరేజి పాటగా చెప్పుకోవచ్చు.అలాంటిది వారికి అవార్డు ఎలా సాధ్యం అంటూ కొంతమంది విమర్శలు చేస్తూ వచ్చారు.ఇప్పుడు ఆ లిస్ట్ లోకి కీరవాణి సొంత తండ్రి శివ శక్తి దత్త చేరిపోయాడు.రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సెన్సేషనల్ గా మారాయి.
ఆయన మాట్లాడుతూ ‘ప్రపంచం మొత్తం నా కొడుకు ఆస్కార్ అవార్డు తీసుకున్నందుకు అభినందిస్తూ ఉంటే నా మనస్సు ఉప్పొంగిపోతుంది. ఒక తండ్రిగా ఎంత గర్వపడుతున్నానో మాటల్లో చెప్పలేను.అయితే ‘నాటు నాటు’ పాట నాకు అంతగా నచ్చలేదు, కీరవాణి స్వరపరిచిన అద్భుతమైన పాటలతో పోలిస్తే ‘నాటు నాటు‘ పాట ఒక్క లెక్కన చెప్పండి.అలాగే లిరిక్ రైటర్ చంద్రబోస్ రాసిన 5 వేల అద్భుతమైన పాటలతో పోలిస్తే ఇది ఎంత.కానీ అదే విచిత్రం ఇన్ని రోజుల వాడి కృషి ఫలితానికి రావాల్సిన గౌరవం ఈ ఇలా దక్కింది.అయితే పాట క్రెడిట్ మొత్తం అద్భుతమైన స్టెప్పులు కంపోజ్ చేసిన ప్రేమ్ రక్షిత్ మాస్టర్, అలాగే అద్భుతంగా డ్యాన్స్ వేసిన రామ్ చరణ్ – ఎన్టీఆర్ లది మాత్రమే.వాళ్ళవల్లే నా కొడుక్కి ఆస్కార్ అవార్డు వచ్చింది’ అంటూ చెప్పుకొచ్చాడు శివ కుమార్ దత్త.ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.