వామ్మో Minister KTR మామూలోడు కాదండోయ్.. కంటి సైగతో యాంకర్ కు చుక్కలు చూపెట్టాడుగా.?

- Advertisement -

Minister KTR కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా బాలయ్య పవర్ఫుల్ డైలాగ్ ను పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేశారు తెలంగాణ మినిస్టర్ కేటీఆర్.. తన కంటి సైగతో యాంకర్ ని హడలెత్తించే హీరోయిజం చూపించారు.. ఇంతకీ ఈ సీన్ ఎక్కడ జరిగిందా అని అనుకుంటున్నారా..? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..

Minister KTR at balaga movie pre release event
Minister KTR

కమెడియన్ గా వేణు పలు సినిమాలలో నటించారు. ఆయన దర్శకుడుగా చేసిన తొలి ప్రయత్నమే బలగం సినిమా. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మితమైన ఈ సినిమా మార్చ్ 3వ తేదీన థియేటర్స్ లో సందడి చేయనుంది.. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా సిరిసిల్లలో అభిమానుల సమక్షంలో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు చిత్ర యూనిట్.. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తెలంగాణ మినిస్టర్ కేటీఆర్ గెస్ట్ గా విచ్చేశారు..

Anudeep

ఇదే ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన డైరెక్టర్ అనుదీప్ ని స్టేజ్ పైకి వచ్చి మాట్లాడమని యాంకర్ పిలిచిన సమయంలో.. అక్కడికి మరో అతిధి హీరో సిద్దు జొన్నలగడ్డ కూడా వచ్చారు.. అనుదీప్ మాట్లాడబోతుంటే యాంకర్ మధ్యలో ఆపేసి సిద్దుకి స్వాగతం పలికింది.. ఇంతలో కేటీఆర్ కలగచేసుకుని కంటి చూపుతోనే మైక్ అనుదీప్ కి ఇవ్వమని అర్థం వచ్చేలాగా ఆ యాంకర్ కి సైగ చేశారు.. ఇది గమనించిన యాంకర్ వెంటనే మైక్ అనుదీప్ కి ఇచ్చేసి పక్కకి వెళ్లిపోయింది..

- Advertisement -

అనుదీప్ కి మైక్ ఇవ్వు అని కేటీఆర్ కను సైగలతో సైగ చేసినప్పుడు యాంకర్ ఫేస్ ఒక్కసారిగా మారిపోయింది.. వెంటనే నవ్వుతూ మైక్ ఇచ్చేసి అనుదీప్ ని మాట్లాడమంటూ యాంకర్ వెళ్లిపోతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.. కేటీఆర్ కళ్ళతోనే ఆ యాంకర్ కి చుక్కలు చూపించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.. దాంతో నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here