అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్న మెహ్రీన్.. షాక్ లో ఫ్యాన్స్

- Advertisement -

మెహ్రీన్ సినీ పరిశ్రమలో హీరోయిన్‏గా నిలదొక్కుకోవాలంటే అందం, టాలెంట్ మాత్రమే కాదు.. కాసింత అదృష్టం ఉండాల్సిందే. తొలి సినిమాతోనే మంచి విజయం అందుకుని… ఆ తర్వాత చిన్న చిన్న సినిమాలతో సరిపెట్టుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. సరైన హిట్ కోసం ఎదురుచూస్తూ.. ఎప్పటికప్పుడు నెట్టింట అభిమానులతో ఇంట్రాక్ట్ అయ్యేందుకు తెగ యాక్టివ్ గా ఉంటున్నారు. చేసిందీ తక్కువ సినిమాలే అయినా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోయిన్ మెహ్రీన్ ఫిర్జాదా.

మెహ్రీన్
మెహ్రీన్

ఆ తర్వాత ఈ అమ్మడు నటించిన చిత్రాలు అంతగా హిట్టు కాలేదు. దీంతో తెలుగు చిత్రపరిశ్రమలో దర్శకనిర్మాతలు ఎక్కువగా పట్టించుకోలేదు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా పలు చిత్రాల్లో నటించింది. అయితే డైరెక్టర్ అనిల్ రావిపూడి, వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబోలో వచ్చిన ఎఫ్ 2 సినిమా ఈ అమ్మాడికి మంచి బూస్ట్ ఇచ్చింది. దీంతో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు క్యూ కట్టాయి. చివరిసారిగా మెహ్రీన్ ఎఫ్ 3 చిత్రంలో కనిపించింది.ఈ మూవీ తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది.

చూడటానికి పక్కింటి అమ్మాయిలా ఉండే ఈ పంజాబీ గర్ల్.. చక్కటి హావభావాలు, డ్యాన్సులతో ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది. అయితే నిన్నమొన్నటి వరకు బొద్దుగా కనిపిస్తూ పాత హీరోయిన్లను గుర్తుచేసిన మెహ్రీన్.. హఠాత్తుగా సైజ్ జీరోలోకి మారిపోయింది. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మెహ్రీన్​ లుక్ చూసి ఫ్యాన్స్ షాకవుతున్నారు. ఆమె ఎందుకిలా మారింది? సినిమా కోసం ఈ గెటప్​లోకి మారిందా అని ప్రేక్షకులు షాకవుతున్నారు. దీనిపై మెహ్రీన్ క్లారిటీ ఇస్తే కానీ స్పష్టత రాదు. మరికొందరేమో ఏమైనా అంతుచిక్కని వ్యాధేమో అని కూడా అంటున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here