Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి తో కలిసి నటించాలంటే ఎవరికైనా కాస్త టెన్షన్ ఉంటుంది. ఆయనతో ఎక్కువ సినిమాలు కలిసి పనిచేసిన నటీనటులు, దర్శక నిర్మాతలకు పెద్దగా టెన్షన్ ఉండకపోవచ్చు కానీ, కొత్తగా ఇండస్ట్రీ కి వచ్చినోళ్లకు మాత్రం వణుకు పడుతుంది అనే చెప్పాలి. అది సహజమే, ఎందుకంటే ఒక పెద్ద స్టార్ పక్కన నటిస్తున్నప్పుడు సరిగ్గా నటిస్తున్నామా లేదా?, ఒకవేళ బాగా చెయ్యకపోయినా, ఎక్కువగా రీ టేకులు తీసుకున్నా ఆయన ఏమనుకుంటారో ఏమో, తిడుతారేమో అనే భయం ఉంటుంది.
ఈ భయం తో కొంతమంది చక్కగా నటించే వాళ్ళు ఉంటారు, కొంతమంది అయితే అదే భయం ని మైండ్ లో పెట్టుకొని సరిగా నటించనోళ్లు ఉంటారు. అలా రౌడీ అల్లుడు సినిమా సమయం లో ఐరన్ లెగ్ శాస్త్రి తో చిరంజీవి కి అనుభవం అయ్యింది. అప్పటికే ఐరన్ లెగ్ శాస్త్రి ఇండస్ట్రీ లో అనేక సినిమాల్లో కమెడియన్ గా నటించి నటుడిగా అనుభవం పొందాడు.
కానీ రౌడీ అల్లుడు సినిమా విషయం లో మాత్రం చిరంజీవి, ఐరన్ లెగ్ శాస్త్రి మధ్య వచ్చే సన్నివేశాలు మాత్రం సరైన టైమింగ్ కుదరకపోవడం తో ఎన్నోసార్లు రీ టేకులు తీసుకోవాల్సి వచ్చిందట. చిరంజీవి తన జీవితం లో ఈ సినిమాలోని ఐరన్ లెగ్ శాస్త్రి తో ఉండే కాంబినేషన్ సన్నివేశాల కోసం తీసుకున్నని టేకులు ఏ సినిమాకి కూడా తీసుకోలేదట. ఒకానొక సందర్భం లో చిరంజీవి కి నటన మీద విసుగొచ్చి, ఈ సినిమా తర్వాత సినిమాలే ఆపేద్దాం అనే ఫీలింగ్ వచ్చేసిందట.
ఈ విషయాన్ని ఆయన రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకున్నాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ చిత్రాన్ని చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. వచ్చే ఏడాది జనవరి 10 వ తారీఖున ఈ సినిమా విడుదల కానుంది.