OG Movie : పవన్ ఓజీ మూవీ క్రేజీ అప్ డేట్.. పదేళ్లు విరామం

- Advertisement -


OG Movie: టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి ‘ఓజీ’. రన్ రాజా రన్, సాహో చిత్రాలకు దర్శకత్వం వహించిన సుజిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రియాంక అరుళ్​ మోహన్ కథానాయికగా నటిస్తున్న ఓజీ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 1990 బ్యాక్‌డ్రాప్‌తో యాక్షన్‌ జానర్‌లో వస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. ఓజీ చిత్రాన్ని సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు.

ఓజీ స్టోరీకి సంబంధించిన ఓ క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాఫియా డాన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. కానీ కథ ప్రకారం మాఫియా డాన్ అయిన పవన్ కొన్ని కారణాల వల్ల పదేళ్లుగా మాఫియాకు దూరంగా ఉంటాడు. 10 సంవత్సరాల విరామం తర్వాత అతను మాఫియాపై బరిలోకి దిగి శత్రువును అంతం చేస్తాడు. ఇదే ఈ సినిమా ప్రధాన కథ అని వినిపిస్తోంది. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే సెప్టెంబర్ వరకు ఆగాల్సిందే.

OG Movie

ఓజీ నుండి ఇప్పటికే ఫస్ట్ లుక్, గ్లింప్స్ విడుదలయ్యాయి. వాటికి మంచి స్పందన వచ్చింది. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్, షాన్ కక్కర్, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here