Megastar cheeranjivi : ఫ్లైట్ లో మందు కొడుతూ కెమెరా కి అడ్డంగా దొరికిపోయిన మెగాస్టార్ చిరంజీవి

- Advertisement -

Megastar cheeranjivi : మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ బిజీ గా ఉంటున్న సంగతి అందరికీ తెలిసిందే, 60 ఏళ్ళ వయస్సులో కూడా ఆయన కుర్ర హీరోలతో సమానంగా సినిమాలు చేస్తూ ఎంతో ఉత్సాహం తో ఉంటున్నాడు. ఈ రేంజ్ ఎనర్జీ కుర్ర హీరోలలో అయినా ఉంటుందో లేదో తెలియదు కానీ, మెగాస్టార్ చిరంజీవి మాత్రం సినిమాకి సినిమాకి మధ్యలో గ్యాప్ అసలు తీసుకోవడం లేదు. రీసెంట్ గానే ఆయన ‘భోళా శంకర్’ సినిమా షూటింగ్ ని పూర్తి చేసాడు.

Megastar cheeranjivi
Megastar cheeranjivi

మెహర్ రమేష్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా వచ్చే నెల 11 వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ ఏడాది ప్రారంభం లో సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం తో మెగాస్టార్ చిరంజీవి ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడా, అదే రేంజ్ బ్లాక్ బస్టర్ ని ‘భోళా శంకర్’ సినిమాతో అందుకోబోతున్నాడని అభిమానులు గర్వంగా చెప్పుకుంటున్నారు.

అయితే సినిమాకి సినిమాకి మధ్య గ్యాప్ లో చిరంజీవి తన సతీమణి సురేఖ తో కలిసి ఫారిన్ ట్రిప్స్ కి ఎంజాయ్ చెయ్యడం కోసం వెళ్తుంటాడు. ఇక నేడు కూడా ఆయన కొద్దిరోజులు రిలాక్స్ కోసం ఫారిన్ ట్రిప్ కి బయలుదేరాడు. ఫ్లైట్ లో వెళ్తూ కొన్ని ఫోటోలను సోషల్ మీడియా లో అప్లోడ్ చేస్తూ, తన తదుపరి చిత్రం గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ లో చేస్తున్నానని, ఆ సినిమా ప్రారంభం అయ్యేలోపు కాస్త చిల్ అయ్యేందుకు మా ఆవిడ తో కలిసి ఫారిన్ ట్రిప్ కి వెళ్తున్నాను అంటూ ఒక ట్వీట్ వేసాడు.

- Advertisement -

యితే ఈ ట్వీట్ లో చిరంజీవి డెస్క్ మీద ఉన్న గ్లాస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అది చూసేందుకు మద్యం లేదా షాంపైన్ లాగా అనిపిస్తుంది. దీనిని చూసి సోషల్ మీడియా లో నెటిజెన్స్ బాస్ మంచి ఫుల్ జోష్ మీద ఉన్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ ఆయన తాగినా కూడా తప్పేమి లేదని, ఈ కాలం లో ఇలాంటివన్నీ సహజమే అని అంటున్నారు ఫ్యాన్స్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here