Allu Arjun : షూటింగ్ స్పాట్ లో హన్సిక ని అల్లు అర్జున్ కొట్టడానికి కారణం అదేనా..!

- Advertisement -

Allu Arjun : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన ‘దేశముదురు’ సినిమా ఆరోజుల్లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. పోకిరి వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత పూరి జగన్నాథ్ వెంటనే చేసిన చిత్రం ఇది. ఇందులోని పాటలు ఆరోజుల్లో ఒక సెన్సేషన్. ఈ సినిమా ద్వారానే ఇప్పుడు సౌత్ ఇండియా లో బిగ్గెస్ట్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న హన్సిక మోత్వానీ హీరోయిన్ గా పరిచయం అయ్యింది.

Allu Arjun
Allu Arjun

తొలిసినిమాతోనే భారీ హిట్ ని అందుకున్న హన్సిక కి టాలీవుడ్ లో అవకాశాలు మామూలు రేంజ్ లో రాలేదు. మరోపక్క కోలీవుడ్ మరియు బాలీవుడ్ నుండి కూడా ఈమెకి మంచి ఆఫర్స్ వచ్చాయి. ఈ సినిమా అప్పుడు ఆమె వయస్సు కేవలం 16 ఏళ్ళు మాత్రమే, అయితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో హన్సిక ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయం లో తనకి అల్లు అర్జున్ తో ఎదురైనా కొన్ని ఫన్నీ సంఘటనలను గుర్తు చేసుకుంది.

ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయం లో హన్సిక కి అన్నీ చాలా కొత్తగా ఉండేదట, ముఖ్యంగా అల్లు అర్జున్ తో సమానంగా డ్యాన్స్ వెయ్యడానికి చాలా కష్టపడిందట. అంతకు ముందు ఈమె బాలనటిగా పలు సినిమాలు చేసింది, కెమెరా ని ఫేస్ చెయ్యడం కొత్తేమి కాదు కానీ, రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడం మాత్రం చాలా కొత్త అట.

- Advertisement -

ఇంకా ఆమె మాట్లాడుతూ ‘ఈ సినిమాలో అల్లు అర్జున్ ముందుగా హన్సిక కి అన్నం తినిపించే షాట్ ఒకటి ఉంటుంది, నాకు చిన్న చిన్న గా ముద్దలు కలుపుకొని తినడం అలవాటు, కానీ అల్లు అర్జున్ పెద్ద పెద్ద ముద్దలు కలిపి ఇస్తుండడం తో , అంత పెద్ద ముద్దలు నేను తినలేను అని చెప్తే, నన్ను తిట్టిమరీ పెద్ద ముద్దలు కలిపి పెట్టాడు’ అని చెప్పుకొచ్చింది. అంతే కాకుండా ఒక సన్నివేశం లో అల్లు అర్జున్ ని హాగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సన్నివేశం ఎంత చెప్పినా హన్సిక కి ఎక్కట్లేదట, దీనితో హన్సిక నెత్తి మీద ఒకటి పీకి, ఏం లేదు జస్ట్ ఇంతే అని హాగ్ చేసుకొని ధైర్యం చెప్పాడట , అప్పుడు ఆమె ఆ సన్నివేశం చేశాను అంటూ చెప్పుకొచ్చింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here