Urvashi Rautela : మన సినీ పరిశ్రమలో హీరోలతో పోలిస్తే హీరోయిన్లకు పారితోషికం చాలా తక్కువ. కొత్త హీరోయిన్లకు అయితే ఇంకా లక్షల్లోనే రెమ్యూనరేషన్ ఇస్తారు. స్టార్ హీరోయిన్లు అయిన అతి కొద్ది మందికే కోటి రూపాయల వరకు పారితోషకం అందుకుంటున్నారు. కొంత మంది హీరోయిన్లు మాత్రం ఆ సినిమాకి కేటాయించిన సమయానికి తగ్గట్టుగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుంటారు.
మరికొందరు ఐటెం సాంగ్స్ కోసం ప్రత్యేకంగా ఒక రేటును ఫిక్స్ చేస్తారు. రెగ్యులర్ గా సినిమాల్లో నటించే దానికంటే ఐటం సాంగ్స్ చేసే వాళ్లకే రేటు ఎక్కువ పలుకుతోంది. తమ కెరీర్‌కు ఇబ్బందిగా మారతాయనే ఉద్దేశ్యంతోనే కొందరు హీరోయిన్స్ స్పెషల్ సాంగ్స్ లేదా ఐటెం సాంగ్స్‌కు ప్రత్యేక ధర నిర్ణయిస్తున్నారు.
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఓ హీరోయిన్ చర్చనీయాంశమైంది. ఆమె ఒక్క నిమిషానికే కోటి రూపాయలు అందుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె మరెవరో కాదు ఊర్వశి రౌతేలా. అవును ఆమె నిమిషాకి కోటి రూపాయలు చొప్పున వసూలు చేస్తుంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో అమ్మడు స్పెషల్ సాంగ్ చేసింది.
ఆ పాటలో కనిపించడానికి ముద్దుగుమ్మ రూ.రెండు కోట్లు చార్జ్ చేసింది. ఆ సినిమా హిట్ అయ్యాక టాలీవుడ్లో ఉర్శశి డిమాండ్ పెరిగింది. ఆ తర్వాత అఖిల్ నటించిన ‘ఏజెంట్’ సినిమాలో ‘వైల్డ్ సాలా..’లో డ్యాన్స్ చేసింది. తాజాగా పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన ‘బ్రో’ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్ లో ఊర్వశి మెరిసింది. ‘బ్రో’ సినిమాతో పాటు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్కంద’ సినిమాలో కూడా ఊర్వశి రౌతేలకు అవకాశం దక్కింది.
ఈ సినిమాలో ఆమె 3 నిమిషాల పాటు ప్రత్యేక పాటలో కనిపించడానికి 3 కోట్లు డిమాండ్ చేసిందట. దీంతో ఊర్వశి రౌతేల ఇండియాలోనే చాలా కాస్ట్లీ హీరోయిన్ అని మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. ప్రస్తుత ఈ రెమ్యునరేషన్ చాలా మంది స్టార్ హీరోయిన్ల కంటే ఎక్కువ. 2013లో సన్నీడియోల్ నటించిన ‘సింగ్ సాబ్ ది గ్రేట్’ సినిమాతో ఊర్వశి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.