Meera Chopra : కొంతమంది హీరోయిన్లు చేసింది ఒకటి రెండు సినిమాలే అయినా ప్రేక్షకులు వాళ్ళను ఎప్పటికీ మర్చిపోలేని రేంజ్ ముద్ర వేసి వెళ్తుంటారు. అలాంటి హీరోయిన్స్ లో ఒకరే మీరా చోప్రా. ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కజిన్ గా ఈమె ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో సరసన నటించే అవకాశం కొట్టేసింది.

ఆయన హీరో గా నటించిన ‘బంగారం’ చిత్రం లో మీరా చోప్రా హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా కమర్షియల్ గా యావరేజి రేంజ్ లో ఆడినప్పటికీ మీరా చోప్రా కి మంచి ఇమేజిని తెచ్చిపెట్టింది. ఈ సినిమా తర్వాత ఆమె వాన, గ్రీకు వీరుడు మరియు మారో వంటి చిత్రాల్లో నటించింది కానీ, ఒక్క సినిమా కూడా సక్సెస్ కాలేదు. దీంతో ఆమె టాలీవుడ్ కి దూరమై, తమిళం , హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ వచ్చింది.

అయితే ఈమె మార్చి నెలలో పెళ్లి చేసుకోబోతుంది. పెళ్లి కొడుకు సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన వాడా?, లేకపోతే బయటవాడా అనే విషయాన్ని ఆమె ఇంకా బయటపెట్టలేదు. రాజస్థాన్ లోని ఒక ప్యాలస్ లో ఈమె వివాహం జరగనుంది. బాలీవుడ్ లో ప్రముఖ నటీనటులు, రాజకీయ నాయకులను ఆహ్వానించినా మీరా చోప్రా, తెలుగు లో కూడా పలువురి సెలబ్రిటీస్ ని ఆహ్వానించినట్టు రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పింది.

ముందుగా తనకి మొదటి సినిమా అవకాశం ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి, నితిన్ కి మరియు నాగార్జున వంటి వారిని ఆహ్వానించింది అట. మరి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి వారిని పిలవలేదా అని అడగగా, వాళ్ళతో నాకు పరిచయం చాలా తక్కువ, రామ్ చరణ్ సినిమాలు చాలా చూసాను కానీ, జూనియర్ ఎన్టీఆర్ వి మాత్రం చూడలేదు. వాళ్ళతో నాకు పరిచయం లేదు కాబట్టే పిలవలేదు అంటూ చెప్పుకొచ్చింది మీరా చోప్రా.