Bigg Boss Telugu : ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ ఎంత ఆసక్తికరంగా సాగుతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ముందు సీజన్స్ లో లాగ కాకుండా ఈసారి సీజన్ లో కంటెస్టెంట్స్ అందరూ టాస్కుల పట్ల తమ వంతు నూటికి నూరు శాతం బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది కంటెస్టెంట్స్ ప్రారంభం లో పెద్దగా ఆడకపోయినా, ఆ తర్వాత తమ ఆట తీరుని మెరుగు పర్చుకొని ముందుకు దూసుకుపోతున్నారు.

అంతా బాగానే ఉంది కానీ , హౌస్ లో ప్రతీ కంటెస్టెంట్ నోరు జారడం ఈ సీజన్ లో చాలా కామన్ అయిపోయింది. ముందు సీజన్స్ తో పోలిస్తే చాలా వరస్ట్ గా తయారైంది పరిస్థితి. అంతకు ముందు ఎంత వాడావేడి చర్చలు జరిగినా లిమిట్స్ క్రాస్ అయ్యేవారు కాదు. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి అలా లేదు. ముఖ్యంగా శివాజీ గ్యాంగ్ మరియు అమర్ దీప్ గ్యాంగ్ మధ్య మాటల యుద్ధం తీవ్ర రూపం దాల్చింది.

ముఖ్యంగా అమర్ దీప్ ప్రశాంత్ ని ‘ఆ నా కొడుకు’ అనడం, అలాగే శోభా శెట్టి యావర్ ని ‘పిచ్చోడు’ అని పిలవడం పెను దుమారమే రేపింది. ఇదంతా ఒక్క ఎత్తు అయితే శివాజీ అమర్ దీప్ ని వాడికి బుర్ర మోకాళ్ళలో ఉంది అనడం, అలాగే అమర్ దీప్ బ్యాచ్ ని మొత్తం గచ్చిబౌలి టీం అని అనడం ఇవన్నీ పెద్ద చర్చకి దారి తీసింది.

ఇకపోతే సందీప్ చాలా కూల్ గా శివాజీ ని ‘బిజ్జలదేవ’ అంటూ అమర్ దీప్ మరియు ప్రియాంక ముందు కామెంట్స్ చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది. బిజ్జల దేవా అంటే బాహుబలి లో నాజర్ పోషించిన క్యారక్టర్. అందులో ఆయనకీ ఒక చెయ్యి పొయ్యుంటాది, కానీ అన్నీ గుంట నక్క వేషాలు వేస్తూ ఉంటాడు. సరిగ్గా శివాజీ క్యారక్టర్ కూడా అలాంటిదే అని సందీప్ ఉద్దేశ్యం. ఇలా హౌస్ మేట్స్ అందరూ విచ్చలవిడిగా నోరు జారేసారు, మరి వీకెండ్ లో నాగార్జున నుండి వీళ్లకు ఎలాంటి కోటింగ్ ఉంటుందో చూడాలి.