Sara Ali Khan – Ananya Pandey : అబ్బబ్బబ్బబ్బ.. ఇటు సారా.. అటు అనన్య జిమ్‎లో ఎవర్ని చూడాలో కూడా అర్థం కావడం లేదు

- Advertisement -


Sara Ali Khan – Ananya Pandey : సినీ ఇండస్ట్రీలో రాణించాలంటే అందం చాలా ముఖ్యం. ఫిట్ గా ఉంటేనే అవకాశాలు వస్తాయి. లేకుంటే ఫేడ్ అవడం ఖాయం. అందుకే సెలబ్రిటీలు తెగ కష్ట పడుతుంటారు. ఎంత కష్టమైన తమ శరీరాన్ని సరైన ఆకృతిలో ఉంచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. షూటింగ్ సమయంలో గ్యాప్ దొరికితే చాలు జిమ్ లో వాలిపోతుంటారు. భారీ వర్కౌట్స్ చేస్తుంటారు. ఆ వీడియోలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. అయితే తాజాగా బాలీవుడ్ ముద్దుగుమ్మ సారా అలీ ఖాన్.. కూడా తన జిమ్లో వర్కౌట్స్ చేస్తున్న వీడియో ఒకదానిని పోస్ట్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది..

Sara Ali Khan - Ananya Pandey
Sara Ali Khan – Ananya Pandey

ఈ ముద్దుగుమ్మ గతంలో కూడా ఓ సారి జాన్వీతో కలిసి, యోగ, జిమ్ చేస్తున్న వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. వీరిద్దరు కలిసి చాలా కాలంగా జిమ్ వర్కవుట్స్ చేస్తుంటారు. కానీ ప్రస్తుతం సారా ‘లైగర్’ భామ అనన్యతో కలిసి జిమ్ లో తెగ కష్టపడుతుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. అందులో సారా, అనన్య చెమటలు చిందిస్తూ వర్కౌట్స్ చేస్తున్నారు. అనన్య .. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన లైగర్ తో తెలుగు తెరకు పరిచయమైంది.

ఈ సినిమాను డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించారు. ఈ సినిమా పై యూనిట్ భారీగా ఆశలు పెట్టుకున్నారు. అంతే రేంజ్ లో ప్రమోషన్స్ కూడా చేశారు. కానీ ఈ సినిమా డిజాస్టర్ అయింది. కానీ మొదటి సినిమాతోనే అనన్య తెలుగు యువతను ఆకట్టుకుంది. కానీ ఈ బ్యూటీకి మరో తెలుగు సినిమాలో అవకాశం మాత్రం రాలేదు. మరోవైపు సారా టాలీవుడ్ ఇండస్ట్రీలో కి అరంగేట్రం చేయనుందని టాక్.. కానీ ఏ హీరోతో అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here