Manushi Chhillar : టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన యానిమల్ మూవీ చుట్టూ ఎన్ని వివాదాలు తలెత్తినా.. చిత్రం మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. బాలీవుడ్, టాలీవుడ్ లలో కలెక్షన్ల సునామీ కురిపించింది. బీ టౌన్ స్టార్ రణ్ బీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించగా అనిల్ కపూర్, బాబీ దేవోల్, పృథ్వీరాజ్, క్యూటీ త్రిప్తి దిమ్రి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టర్ లో 100 శాతం నటనను రాబట్టాడు సందీప్. రణ్ బీర్ నటనకు వంక పెట్టనక్కర్లేదు. కానీ ఈ చిత్రంలో రణ్ బీర్ తర్వాత అంత పవర్ ఫుల్ గా.. ఆల్ఫా మేల్ కు దీటుగా ఉన్న క్యారెక్టర్ గీతాంజలి. అదేనండి మన రష్మిక పోషించిన పాత్ర.

ఈ మూవీలో రష్మిక చాలా పవర్ ఫుల్ పాత్రలో నటించింది. తన సినిమా కెరీర్ లోనే ఈ పర్ఫామెన్స్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. కొన్ని కొన్ని సీన్లలో రణ్ బీర్ ని కూడా బీట్ చేసేసింది. ముఖ్యంగా కర్వా చౌత్ సీన్ లో అదరగొట్టిందని చెప్పొచ్చు. అయితే యానిమల్ లో రష్మిక యాక్టింగ్ పై మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ నటి మానుషీ చిల్లర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
‘బడే మియా ఛోటే మియా’ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మానుషి చిల్లర్ తన నటనను సవాలు చేసే పాత్రల కోసం వేచి చూస్తున్నానని చెప్పింది. అయితే తనకు సందీప్ రెడ్డి వంగా చిత్రాలంటే చాలా ఇష్టమన్న ఈ బ్యూటీ, భవిష్యత్తులో అవకాశం వస్తే తప్పకుండా ఆయనతో కలిసి పని చేస్తానని చెప్పుకొచ్చింది.
అంతే కాదు.. యానిమల్ మూవీలో రష్మిక పోషించిన గీతాంజలి పాత్ర తనకు చాలా చాలా నచ్చిందని తెలిపింది. ‘కుటుంబంలో కలతలు వచ్చినప్పుడు తను ధైర్యంగా నిలబడింది. రష్మిక నటన అద్భుతం. నటిగా నన్ను సవాలు చేసే అలాంటి పాత్రలు చేయాలని ఉంది’ అని ఈ భామ తన మనసులోని కోరికను బయట పెట్టింది.
అంతే కాదు సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ డెబ్యూ మూవీ ‘అర్జున్ రెడ్డి’కి రీమేక్‌గా తెరకెక్కిన ‘కబీర్ సింగ్’లో ప్రీతి పాత్ర కోసం చిత్రబృందం మొదట తననే అప్రోచ్ అయిందట. షాహిద్ మూవీలో హీరోయిన్ ఛాన్స్ వచ్చిందనే విషయం తెలియక తాను రిజక్ట్ చేశానని చెప్పింది మానుషి. మరోవైపు ఆ సమయంలోనే తాను మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుపొందానని.. దాంతో ఏడాదిపాటు ఆ బృందంతో కాంట్రాక్ట్ కుదిరిందని చెప్పింది. అందుకే ఆ చిత్రం చేయలేకపోయిందట
ఇక మానుషి.. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘ఆపరేషన్ వాలెంటైన్’తో ఆమె తెలుగు వారికి పరిచయమైన విషయం తెలిసిందే. వైమానిక దళంలోనే పనిచేసే రాడార్ ఆఫీసర్ అహనా గిల్ పాత్రలో ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ భామ బడే మియా.. ఛోటే మియా పాత్రలో నటించింది.