Manoj: రామ్ చరణ్, మంచు మనోజ్ మంచి స్నేహితులు.. మంచు మనోజ్ మార్చ్ 3న భూమా మౌనికను పెళ్లి చేసుకున్నారు.. మూడుముళ్ల బంధంతో ఒక్కటైనా ఈ కొత్త జంటకి రామ్ చరణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఆస్కార్ ప్రమోషన్స్ లో భాగంగా అమెరికాలో బిజీగా ఉండడంతో రామ్ చరణ్ దంపతులు ఈ వేడుకకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో మనోజ్ దంపతులకు ప్రత్యేకమైన బహుమతులు పంపారు రామ్ చరణ్, ఉపాసన..
మనోజ్ భూమిక కు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతూ సర్ప్రైజ్ గిఫ్ట్ ను పంపించారు.. ఆ గిఫ్ట్స్ ను రిసీవ్ చేసుకున్న మంచు మనోజ్ రామ్ చరణ్ పంపించిన సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇవే అంటూ థాంక్యూ రామ్ చరణ్ ఉపాసన లవ్ యు మిస్టర్ అండ్ మిసెస్ మిత్రమా.. మాల్దీవ్స్ ట్రిప్ నుంచి తిరిగిరానే ఎప్పుడెప్పుడు మిమ్మల్ని కలుద్దామా అని ఎదురుచూస్తున్నాను. మీ ఇద్దరినీ కలవాలని ఉంది అంటూ మనోజ్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మా రింది.
మంచు మనోజ్ ప్రస్తుతం వాట్ ద ఫిష్ మనం మనం బరంపురం సినిమాలో నటిస్తున్నారు. బైక్ రేస్ చుట్టూ సాగే సినిమా ఇది . దీని ద్వారా వి అనే వ్యక్తి దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఈ సినిమాలో ఫస్ట్ లుక్ పోస్టర్ని జనవరి 20న సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా మంచు మనోజ్ అభిమానులతో పంచుకున్నారు. మనోజ్ మౌనిక వెకేషన్ పూర్తిచేసుకుని తిరిగి రాగానే రామ్ చరణ్ ఉపాసనలను కలవనున్నారు.