Manchu Manoj : దమ్ముంటే బయటకి రారా నా కొ**కా అంటూ మంచు మనోజ్ పై దూసుకెళ్లిన మంచు విష్ణు.. వీడియో వైరల్

- Advertisement -

Manchu Manoj : గత కొంతకాలం నుండి సోషల్ మీడియా లో మంచు బ్రదర్స్ మధ్య గొడవలు ఉన్నాయి.అందుకోసమే మనోజ్ గత కొంతకాలం నుండి సెపెరేట్ గా ఉంటున్నాడు అంటూ ఇలా పలు రకాల వార్తలు ప్రచారం అవుతూ ఉండేవి.అయితే మా మధ్య అలాంటివి ఏమి లేదంటూ మంచు విష్ణు పలు సందర్భాలలో చెప్పుకొచ్చాడు.కానీ నేడు వీళ్లిద్దరి మధ్య జరిగిన గొడవ కోట్లాది మంది ప్రేక్షకుల ముందు బహిర్గతం అయ్యింది.

Manchu Manoj
Manchu Manoj

మంచు మనోజ్ వ్యక్తిగత PA పట్టాభి పై మంచు విష్ణు నేరుగా ఇంట్లోకి చొరబడి కొట్టడానికి ప్రయత్నం చేశాడంటూ మనోజ్ ఒక వీడియో ని విడుదల చేసాడు..ఫేస్ బుక్ లో మనోజ్ అప్లోడ్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియా లో కలకలం సృష్టించింది.ప్రస్తుతం నెటిజెన్స్ ఎక్కడ చూసిన దీని గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు.వీడియో కాస్త వైరల్ అవ్వడం తో మోహన్ బాబు మనోజ్ ని తిట్టి డిలీట్ చేయించాడు.

Manchu Vishnu
Manchu Vishnu

అయితే ఈ వ్యవహారం మోహన్ బాబు ఒక ప్రముఖ మీడియా ఛానల్ కి ఫోన్ చేసి స్పందించాడు.’అన్నదమ్ముల మధ్య గొడవలు రావడం అనేది సహజం, కానీ గొడవలు ఎప్పుడు అనర్దానికే దారి తీస్తుంది, నేడు జరిగింది కూడా అదే,ఇది వాళ్లకి మంచిది కాదు’ అంటూ మాట్లాడాడు.మొన్ననే మంచు మనోజ్ రెండవ పెళ్లి జరిగింది, ఈ పెళ్ళికి మంచు విష్ణు అయిష్టంగానే వచ్చినట్టు సమాచారం.

- Advertisement -

కేవలం మొక్కుబడిగా 10 నిముషాలు మాత్రమే ఉండి వెళ్ళిపోయాడు.ఇది పెద్ద న్యూస్ అయ్యింది, అప్పుడే అందరికీ వీళ్ళ మధ్య గొడవలు ఉన్న సంగతి రూమర్స్ కాదు, నిజమే అని తెలిసింది.కానీ ఇప్పుడు వీళ్ళ మధ్య గొడవ రోడ్డు మీదకి వచ్చేసింది.సోషల్ మీడియా లో నెటిజెన్స్ అందరూ మజోజ్ కి సపోర్టుగా నిలుస్తున్నారు.ఈ గొడవ ఎక్కడ దాకా దారి తీస్తుందో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here