Manchu Manoj : ఎట్టకేలకు గుడ్​ న్యూస్ చెప్పేసిన మంచు మనోజ్​.. త్వరలోనే?



Manchu Manoj : కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ శ్రీ అనే సినిమాతో టాలీవుడ్​లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత దొంగ దొంగది సినిమాతో మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఇక అలా వరుస అవకాశాలు అందుకుంటూ టాలీవుడ్​లో తన కంటూ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. 2017లో వచ్చిన గుంటూరోడు, ఒక్కడు మిగిలాడు సినిమాలే మనోజ్ చివరగా కనిపించిన మూవీస్. ఆ తర్వాత తాను సినిమాలకు దూరంగా ఉందామనుకుంటున్నానని ఓ ప్రకటన చేశాడు.

Manchu Manoj
Manchu Manoj

మనోజ్ చేసిన ఆ ప్రకటనతో ఆయన అభిమానులు నిరాశ చెందారు. కొంత కాలం ఆయన రాజకీయాల్లోకి వెళ్తారనే పుకార్లు కూడా వచ్చాయి. కానీ మనోజ్ అలాంటి స్టెప్ ఏం తీసుకోలేదు. ఓవైపు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని సమస్యల్లో ఉన్నట్టున్నాడనే వార్తలు కూడా వచ్చాయి. ఈ వార్తలకు ఊతమిస్తూ మంచు మనోజ్ తన భార్య ప్రణతితో విడాకులు తీసుకున్నాడు.

ఇక ఆ తర్వాత అహం బ్రహ్మస్మి అనే సినిమాలో నటించనున్నట్లు ప్రకటన చేశాడు. ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినట్లు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. కానీ కొంతకాలంగా ఆ సినిమా ఊసే లేదు. ఇక రెండ్రోజుల క్రితం మనోజ్ ఓ ఇంట్రెస్టింగ్ ప్రకటన చేశాడు. త్వరలో కొత్త జీవితం ప్రారంభించబోతున్నానంటూ ట్వీట్ చేశాడు మంచు మనోజ్..

What the fish
What the fish

“నా హృదయానికి చేరువైన ఓ ప్రత్యేకమైన వార్తను గత కొంతకాలంగా నాలోనే దాచుకొని ఉన్నాను. జీవితంలోని మరో దశలోకి అడుగు పెడుతోన్నందుకు ఆనందంగా ఉంది. దీనికి సంబంధించిన వివరాలను జనవరి 20న ప్రకటిస్తా. ఎప్పటి మాదిరిగానే మీ ఆశీస్సులు కావాలి’’ అని పేర్కొన్నాడు. ఈ ట్వీట్‌ని చూసిన పలువురు నెటిజన్లు ‘‘అన్నా.. నువ్వు మళ్లీ పెళ్లి చేసుకుంటున్నావా?’’, ‘‘కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించనున్నావా?’’ అని ప్రశ్నల వర్షం కురిపించారు.

అయితే మనోజ్ చెప్పిన గుడ్​ న్యూస్ ఏంటో క్లారిటీ వచ్చేసింది. ఎట్టకేలకు మంచు మనోజ్ శుభవార్త చెప్పేశాడు. అందరూ అనుకున్నట్లు తన పెళ్లి గురించి కాకుండా.. కొత్త సినిమా గురించి తెలిపాడు. వెండితెరకు దూరమై చాలా ఏళ్లు అయినా తాను మళ్లీ రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రకటించాడు. తన కొత్త ప్రాజెక్ట్​ టైటిల్​ పోస్టర్​ను రిలీజ్ చేశాడు.

‘నేను సినిమా చేసి చాలా ఏళ్లు అవుతోంది. అయినప్పటికీ మీరు నాపై ప్రేమ కురిపిస్తూనే ఉన్నారు. మీరు చూపిస్తున్న ప్రేమకు తిరిగివ్వాల్సిన సమయం వచ్చేసింది. వాట్‌ ద ఫిష్‌ అనే కొత్త సినిమాతో మీ ముందుకు రాబోతున్నా. ఈ మూవీ మీ అందరికీ కచ్చితంగా క్రేజీ ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుంది’ అని ఆశిస్తున్నట్లు ట్వీట్‌ చేశారు.

ఇది చూసిన మంచు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కంగ్రాంట్స్​ అంటూ ట్వీట్లు చేస్తున్నారు. ‘మొత్తానికి రీఎంట్రీ ఇస్తున్నావు, అది చాలు భయ్యా’, ‘పోస్టర్​ అదిరింది’, ‘మరి అహం బ్రహ్మాస్మి సంగతేంటి?’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.